Tuition Teacher Molests Student in Gujarat - Sakshi
Sakshi News home page

ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత.. 

May 27 2022 12:27 PM | Updated on May 27 2022 1:04 PM

Tuition Teacher Harassed By Student At Gujarat - Sakshi

దేశంలో యువతులు, మహిళపై లైంగిక దాడులు ఆగడం లేదు. ఎన్ని కొత్త చట్టాలు తీసుకువచ్చినా అత్యాచారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టీచర్‌.. స్టూడెంట్‌ను లైంగికంగా హిసించి గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. దాహోద్‌ జిల్లాలోని జలోద్‌లో ఓ విద్యార్థిని(17).. నైనేష్‌ దామోరా ఆధ‍్వర్యంలో నడిచే కోచింగ్‌ క్లాసులకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రోజు.. దామోరా.. విద్యార్థిని వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు వీడియోను రికార్డు చేశాడని బాధితురాలు తెలిపింది. అనంతరం ఆ వీడియోను చూపించి.. ఆమెను దామోర్‌ బెదిరింపులకు గురిచేశాడు. ఆ తర్వాత వీడయోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేసి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా.. ఈ వీడియోను ఆసరాగా చేసుకుని ఆమెపై టీచర్‌ పలుమార్లు లైంగిక దాడి చేయగా బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసినట్టు  జలోద్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌సీ రత్వా తెలిపారు. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: బరాత్‌లో పెళ్లి కొడుకు అత్యుత్సాహం.. వధువుకు చేదు అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement