లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు.
లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment