woman judge
-
‘‘చంపేస్తాం’’.. మహిళా జడ్జికి బెదిరింపు లేఖ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఇదీ చదవండి.. అతనికి 35, ఆమెకు 42 -
గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి,ఎవరీ శ్రీపతి?
తమిళనాడు తిరుపట్టూరు జిల్లాఎలగిరి హిల్స్‌కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు.నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. శ్రీపతి పరిచయం... ఆరు నెలల క్రితం... తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. నాలుగున్నర గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కాని మరుసటి రోజు చెన్నైలో ‘తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్’(టి.ఎన్.పి.ఎస్.సి) ఎగ్జామ్ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె ‘సివిల్ జడ్జ్’ అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తోంది. ఆమె పేరు వి. శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న ‘మలయలి’ తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా విశేషం. సివిల్ జడ్జి కావడం అంటే చరిత్రే. చురుకైన అమ్మాయి తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళి రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసి΄ాపగానే చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ల గూడెం నుంచి బస్సెక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్ అక్కడినుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్ (తిరుపట్టూరు జిల్లా)కు మకాం మార్చాడు. ఇక్కడా కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్లుండే అత్తనాపూర్‌లో ఇంటర్ వరకూ చదివించే మిషనరీ స్కూల్ ఉంది. అక్కడే శ్రీపతి ఇంటర్ వరకూ చదువుకుంది. ‘ఇప్పుడు చదివి ఏం చేయాలంటా’ అని తోటి తెగ వారు తండ్రిని, తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్లు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి. గిరిజనుల హక్కుల కోసం ‘మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మావాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చేయాలి. వారి హక్కులు వారు ΄÷ందేలా చేయాలి. అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను’ అంది శ్రీపతి. ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లాకోర్సులో చేరింది. చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసే వెంకటేశన్‌తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జి పోస్ట్ కోసం టి.ఎన్.పి.ఎస్.సి పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సి.ఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. ‘తమిళ మీడియంలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడం వల్లే శ్రీపతి సివిల్‌జడ్జి కాగలిగిందని... ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని’ స్టాలిన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. -
బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?
బిల్కిస్ బానో కేసులో ఖైదీల క్షమాభిక్ష చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దోషులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ సర్కార్‌కు లేదని స్పష్టం చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థ మీద ఆశలు చిగురించాయి దేశవ్యాప్తంగా సంచనల రేపిన ఈ తీర్పు బాధితురాలితోపాటు, సామాజిక కార్యకర్తలు మహిళాసంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు ఊరటనిచ్చింది. మరోవైపు పలువురి పోరాటం,మద్దతు,మీడియా సాధించిన విజయని బిల్కిస్ బానో తరపున పిటీషన్ దాఖలు చేసిన వారు పేర్కొన్నారు. న్యాయం వ్యవస్థపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని రూప్‌రేఖా వర్మ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మహిళలు నిరాశ పడకుండా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చిందన్నారు. ఈ కేసులో సర్ఫరోషి ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, కమ్యూనిస్ట్ నాయకురాలు మాజీ ఎంపీ సుభాషిణి అలీ, బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ కూడా ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కేసులో ఆదినుంచీ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన బిల్కిస్ బానో, గుజరాత్ కోర్టు తీర్పు తరువాత ఏ మాత్రం ధ్యైర్యాన్ని కోల్పోకుండా, నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు గడప తొక్కిన వైనం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. వీరితో పాటు మరోపేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవ్వరో కాదు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ బీవీ నాగరత్న. ఇంతకీ ఎవరీ నాగరత్న? ఎవరీ జస్టిస్ బీవీ నాగరత్న బిల్కిస్ బానో రేపిస్టులను మళ్లీ జైలుకు పంపిన ఎస్సీ జడ్జి బీవీ నాగరత్న ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసిన రిమిషన్ ఉత్తర్వులను రద్దు చేసిన సుప్రీం న్యాయమూర్తి బీవీ నాగరత్న దోషులు రెండు వారాల్లో లొంగి పొవాలంటూ ఆదేశాలిచ్చి సంచలనం రేపారు. 1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ బెంగుళూరు వెంకటరామయ్య నాగరత్న ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. దివంగత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె.కర్ణాటకకు చెందిన తొలి సుప్రీం న్యాయమూర్తి కూడా. మాండ్య జిల్లా, ఎంగలగుప్పె చత్ర గ్రామానికి చెందిన నాగరత్న న్యూఢిల్లీలోని భారతీయ విద్యాభవన్‌లో విద్యను అభ్యసించారు.1984లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాల నుండి BA హిస్టరీ పట్టా తీసుకున్నారు. 1987లో న్యాయ పట్టా పొందారు. న్యాయవాద వృత్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 28, 1987న కర్ణాటక బార్ కౌన్సిల్లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. రాజ్యాంగ, వాణిజ్య, బీమా, సేవ, పరిపాలనా మరియు ప్రజా చట్టం, భూమి మరియు అద్దె చట్టాలు, కుటుంబ చట్టం మరియు మధ్యవర్తిత్వంలో నిపుణత సాధించారు. ఫిబ్రవరి 18, 2008న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగాను, ఫిబ్రవరి 17, 2010న శాశ్వత న్యాయమూర్తిగాను నియమితులయ్యారు. అనంతరం 2021 ఆగస్టులో భారత సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. జస్టిస్ నాగరత్న2027, సెప్టెంబరులో కేవలం 36 రోజుల వ్యవధిలో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (CJI) కావాల్సి ఉంది. కీలక తీర్పులు కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి పలు కీలక తీర్పులను వెలువరించిన నాగరత్నం 2012లో ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ఆమెకే దక్కింది. నోట్ల రుద్దు చట్ట విరుద్ధం: ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నోట్ల రద్దుపై ఆమె అభిప్రాయాలు ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అత్యంత ప్రముఖమైనదిగా పేరొంది. 2016 నవంబరు నాటి నోట్ల రద్దు నిర్ణయంపై, సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు డీమానిటైజేషన్ సమర్థించగా మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా జస్టిస్ నాగరత్న అది సదుద్దేశంతో కూడుకున్నదే కానీ చట్టవిరుద్ధని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడం కంటే దానిని అమలు చేయడానికి శాసన ప్రక్రియను అనుసరించాల్సి ఉందని చెప్పారు. 2019 తీర్పులో, జస్టిస్ నాగరత్న దేవాలయం వాణిజ్య సంస్థ కాదంటూ మరోసాహసోపేత తీర్పును వెలువరించారు. దాని ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులు కాదని, అయితే కర్ణాటక హిందూ మతపరమైన సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా చట్టం ప్రకారం ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. కర్నాటక హైకోర్టులో 2021లో పోక్సో చట్టంపై ఇచ్చిన తీర్పు గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 35లో పేర్కొన్న ఆదేశాన్ని పూర్తి కాని పక్షంలో నిందితులకు బెయిల్‌పై హక్కు ఉండదని జస్టిస్‌లు బీవీ నాగరత్న , ఎంజి ఉమతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అంటే కేసును మొదట గుర్తించినప్పటి నుండి ఒక సంవత్సరంలోపు విచారణను ముగించాలి. పిల్లల ప్రమేయం ఉన్నట్లయితే, నేరాన్ని అంగీకరించిన 30 రోజులలోపు కోర్టు వారి సాక్ష్యాలను నమోదు చేయాలి. ఏవైనా జాప్యాలు జరిగితే వాటిని వ్రాతపూర్వకంగా రికార్డు చేయాలని కూడా స్పష్టం చేశారు. బిల్కిస్ బానో కేసు 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సమయంలో బిల్కిస్ బానోపై ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలు నమోదైనాయి. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తరువాత ఈ తీర్పుపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షగా మారింది. అయితే గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున సత్ ప్రవర్తన, 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారంటూ క్షమాభిక్షపేరుతో విడుదల చేసింది. దీంతో దిగ్భాంతికి గురైన బిల్కిస్ బానో తిరిగి సుప్రీను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఈక్రమంలో జస్టిస్ నాగరత్న గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. దోషుల క్షమాభిక్షను రద్దు చేశారు. -
కోర్టుకు హాజరైన ట్రంప్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయంలో తాను నిర్దోషినని తనకే పాపం తెలీదని చెప్పారు. ఇండియన్ అమెరికన్ మహిళా న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ ఎదుట ట్రంప్ హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ కేసులో ఇరికించారని ట్రంప్ పేర్కొన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినప్పటికీ దానిని అధికారికంగా వెల్లడించకుండా 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు హాలు వెనుక తలుపులోంచి లోపలికి ప్రవేశించారు. ఎవరీ ఉపాధ్యాయ ?: న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ గుజరాత్లో జన్మించారు. ఆమె చిన్నతనంలో తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోవడంతో కన్సస్‌లో పెరిగారు. -
జడ్జినే బెదిరించాడు!
జైపూర్: మార్ఫ్డ్ ఫొటోలను పంపి రూ.20 లక్షలివ్వకుంటే వాటిని బయటపెడతామంటూ మహిళా జడ్జిని బెదిరించిన ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జడ్జికి ఫిబ్రవరి 7న ఒక పార్సిల్ వచ్చింది. జడ్జి పిల్లలు చదివే స్కూలు నుంచి వచ్చిందంటూ ఓ అగంతకుడు పార్సిల్‌ను కోర్టు స్టెనోగ్రాఫర్‌కు ఇచ్చాడు. పేరు అడగ్గా చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ పార్సిల్లో కొన్ని స్వీట్లతోపాటు అభ్యంతరకరంగా ఉన్న జడ్జి ఫొటోలు కనిపించాయి. రూ.20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తాననే హెచ్చరికతో కూడిన ఉత్తరం ఉంది. జడ్జి చాంబర్‌లోని సీసీ కెమెరాలో ఓ 20 ఏళ్ల యువకుడు పార్సిల్ తెచ్చినట్లుగా రికార్డయింది. మరో 20 రోజుల తర్వాత జడ్జి ఇంటికి మళ్లీ ఒక పార్సిల్ వచ్చింది. ‘రూ.20 లక్షలు సిద్ధంగా ఉంచు. సమయం, ప్రాంతం త్వరలోనే చెబుతా’అంటూ లేఖ ఉంది. బాధిత న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేశారు. ఆగంతకుడిని గుర్తించామని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
‘స్త్రీలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’
న్యూఢిల్లీ: ‘‘లా అంటే నేటికి కూడా ధనవంతులు మాత్రమే చదవగలిగే కోర్సుగానే చూస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తుంది. అలానే న్యాయవాద వృత్తిని స్వీకరించే మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. దేశంలోని పలు కోర్టుల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే హైకోర్టులలో ఉన్న ఖాళీల్లో 90శాతం పోస్టులను మరో నెల రోజుల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు ఎన్వీ రమణ తెలిపారు. ఎలాంటి వివాదం లేకుండానే కేవలం ఆరు రోజుల్లోనే సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియాకమానికి అనుమతులిచ్చినందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి జస్టిస్ రమణ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘లా కోర్సు అనగానే కేవలం ధనవంతులు మాత్రమే చదవగలిగేదిగా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అవకాశాలు పెరుగుతున్నాయి. న్యాయవాద వృత్తి నేటికి కూడా పట్టణ వాసులకు సంబంధించిన వృత్తిగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వృత్తిల్లో స్థిరంగా కొనసాగవచ్చు అని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే న్యాయవాద వృత్తిని స్వీకరించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది’’ అన్నారు. అలానే కోర్టుల్లో మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఎన్వీ రమణ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రికి నివేదిక సమర్పించారు. (చదవండి: ఇదేం బాధ్యతారాహిత్యం) ఈ సందర్భంగా ఎన్వీ రమణ కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. నేను హైకోర్టులో పని చేసే రోజుల్లో మహిళా జడ్జీల కోసం కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కావు. నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాను’’ అన్నారు. దేశవ్యాప్తంగా పది హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!) -
సుప్రీంకోర్టు: నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు..
న్యూఢిల్లీ: జస్టిస్ ఇందు మల్హోత్రా తాజాగా పదవీ విరమణ పొందడంతో సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఒకే ఒక మహిళా జడ్జి మిగిలారు! మూడేళ్ల క్రితం ఇందిరా బెనర్జీ చేరికతో సుప్రీం కోర్టులో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు (అప్పటికే ఉన్న జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కలిపి) ఉండటం పెద్ద విశేషం అయింది. గత ఏడాది జూలైలో జస్టిస్ భానుమతి రిటైర్ అయ్యారు. ఇప్పుడు జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జస్టిస్ ఇందిర ఒక్కరే ఉన్నారు! నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు. అరుదైన ఖగోళ అద్భుతంగా మూడేళ్ల క్రితం ఒక విశేషం వార్తల్లోకి వచ్చింది. ‘జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అడుగు పెట్టడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లయింది’ అన్నది ఆ విశేషం. 2018 ఆగస్టున సుప్రీం కోర్టుకు వచ్చారు జస్టిస్ ఇందిర. మిగతా ఇద్దరు జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా. గత జూలైలో భానుమతి, మొన్న శనివారం ఇందూ మల్హోత్రా రిటైర్ అయ్యారు. ఇక మిగిలింది ఇందిరా బెనర్జీ ఒక్కరే. జస్టిస్ మల్హోత్రా పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘యంగ్ లాయర్స్ ఫోరమ్’ ఆమెకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య పెరగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాజాగా పదవీ విరమణ పొందిన జస్టిస్ ఇందూ మల్హోత్రా బార్ కౌన్సిల్ నుంచి నేరుగా జడ్జి అయిన తొలి మహిళా జస్టిస్. సుప్రీంకోర్టులో ఆమె 30 ఏళ్లు పాక్టీస్ చేశారు. ప్రస్తుతం మిగిలిన ఏకైక మహిళా జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీం కోర్టులో చరిత్రలో 8 వ మహిళా న్యాయమూర్తి. వచ్చే సెప్టెంబరులో జస్టిస్ ఇందిర పదవీ విరమణ పొందేలోపు కొత్త మహిళా న్యాయమూర్తి రాకపోతే ఆమె తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులే కనిపించని పరిస్థితి ఉంటుంది. భారత సుప్రీంకోర్టు ఏర్పాటైన (1950) నలభై ఏళ్లకు 1989 అక్టోబరులో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టుకు తొలి మహిళా జడ్జిగా వచ్చారు. 1992 ఏప్రిల్ వరకు ఉన్నారు. జస్టిస్ ఫాతిమా తర్వాత జస్టిస్ సుజాత మనోహర్ (1994–1999), జస్టిస్ రుమాపాల్ (2000–2006), జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా (2010–2014), జస్టిస్ రంజనా దేశాయ్ (2011–2014), జస్టిస్ భానుమతి (2014–2020), జస్టిస్ ఇందూ మల్హోత్రా (2018–2021) సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులుగా సేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో పనిచేశారు. -
అత్యాచారం కేసులో నలుగురికి ఉరిశిక్ష
► ఏం జరిగింది: 2014లో కోలారు జిల్లా మాలూరు తాలూకాలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న టెన్త్ విద్యార్థినిపై నలుగురు మృగాళ్ల సామూహిక అత్యాచారం. 2018 ఆగస్టులో మాలూరు పట్టణంలో పట్టపగలే టెన్త్ బాలికపై మరో కామాంధుడు దాడి, బండరాయితో కొట్టి హత్య ► ఏం తీర్పు: దోషుల దురాగతాలను నిర్ధారించిన న్యాయస్థానాలు.. వారికి ఉరే సరి అని తీర్పునిచ్చాయి. రెండవ కేసులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లో విచారణను పూర్తి చేయడం విశేషం. కోలారు: మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన ఘటనలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ కోలారు రెండవ అదనపు సెషన్స్ న్యాయస్థానం శనివారం సంచలన తీర్పును వెలువరించింది. 2014 వ సంవత్సరం మే నెల 28వ తేదీన మాలూరు తాలూకా నటోరహళ్లి క్రాస్ వద్ద పదవ తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు చుట్టుముట్టారు. బలవంతంగా చెరువులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక చనిపోయిందని భావించిన కామాంధులు వెళ్లిపోయారు. విషయం తెలిసిన మాస్తి పోలీసులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు గాలించి నిందితులు మునికృష్ణ (23 ఏళ్లు, సెక్యూరిటిగార్డు), నారాయణస్వామి (22, కూలీపని) అనిల్‌కుమార్ (20, బెంగుళూరులో బికాం విద్యార్థి) కృష్ణమూర్తి (20, ట్రాక్టర్ డ్రైవర్)లను అరెస్టు చేశారు. కోర్టులో విచారణలో కామాంధుల దురాగతం రుజువు కావడంతో కోర్టు శనివారం నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు దోషులను జిల్లా జైలుకు తరలించారు. విద్యార్థిని హత్య కేసులో... కొద్దిరోజుల క్రితం మాలూరు పట్టణంలో సంచలనం కలిగించిన పదవ తరగతి విద్యార్థిని రక్షిత అత్యాచార యత్నం, హత్య కేసులో కోలారు జిల్లా రెండవ అదనపు న్యాయస్థానం దోషికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఆగస్టు నెల 1వ తేదీన మాలూరు పట్టణంలో పదవ తరగతి విద్యార్థిని టీకల్ గ్రామానికి చెందిన సురేష్‌కుమార్ అనే యువకుడు వెంబడించి అత్యాచారయత్నం చేసి కుదరక పోవడంతో బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘోరం పట్టణంలో కలకలం రేపింది. ప్రజాసంఘాలు భారీఎత్తున ఉద్యమాలు జరిపాయి. నిందితుడు సురేష్‌కుమార్ (23, తాపీ పని)ను మాలూరు పట్టణ పోలీసులు రెండురోజుల తరువాత అరెస్టు చేసి అత్యాచారం యత్నం, హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. చకచకా విచారణ జరిపి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. శరవేగంతో విచారణ జరిగింది. ఛార్టిషీట్ దాఖలు చేసిన 13 రోజులకే కోర్టు అతని నేరాన్ని నిర్ధారించి శనివారం మధ్యాహ్నం న్యాయమూర్తి బి ఎస్ రేఖ తీర్పును వెలువరించారు. రక్షితకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను జరిగాయి. ఘటన జరిగిన 45 రోజులకే నిందితుడికి కోర్టు శిక్ష పడడం విశేషం. -
రేప్ కేసుపై మహిళా జడ్జి సంచలన ఆదేశాలు
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినా.. ప్రతి సందర్భంలోనూ దాన్ని అత్యాచారం అనలేమని బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 21 ఏళ్ల యువకుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంగా ఆమె ఇలా అన్నారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో అతడు విడిపోయిన తర్వాత ఆమె అతడిపై రేప్ కేసు పెట్టగా, చదువుకున్న అమ్మాయిలు పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకునే ముందు తమ నిర్ణయానికి తామే బాధ్యత తీసుకోవాలని జస్టిస్ మృదులా భత్కర్ చెప్పారు. ఒకవేళ మోసం చేసి అంగీకారం పొందితే మాత్రం అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు. ఆమెను బలవంతంగా శృంగారానికి ఒప్పించారని చెప్పేందుకు బలమైన సాక్ష్యాలు ఉండాలని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం అనే విషయం మాత్రం ఇలాంటి కేసుల్లో నిలబడదని జస్టిస్ మృదులా భత్కర్ స్పష్టం చేశారు. సమాజం శరవేగంగా మారుతున్నా, ఇప్పటికీ నైతిక విలువలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె చెప్పారు. పెళ్లి సమయానికి కన్యగానే ఉండాల్సిన బాధ్యత మహిళపై ఉందన్న నైతిక సూత్రం తరతరాలుగా మన దేశంలో ఉందని, అయితే ప్రస్తుత యువతరం మాత్రం పలువురితో మాట్లాడుతూ లైంగిక కార్యకలాపాల గురించి బాగా తెలుసుకుంటున్నారని అన్నారు. సమాజం స్వేచ్ఛాయుతం కావడానికి ప్రయత్నిస్తోంది గానీ నైతిక విలువల విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు. అబ్బాయితో ప్రేమలో ఉన్నప్పుడు అతడితో శృంగారంలో పాల్గొనాలా వద్దా అనేది ఇద్దరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, అలాంటప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించాలన్న విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారని జస్టిస్ భత్కర్ అన్నారు. అమ్మాయిలు పెద్దవాళ్లయి, చదువు కూడా ఉన్నప్పుపడు పెళ్లికి ముందు సంబంధాల వల్ల వచ్చే ఫలితాల గురించి కూడా ఆలోచించాలని చెప్పారు. -
మహిళా జడ్జిపై వేధింపులు.. ఓలా డ్రైవర్ అరెస్టు
దేశ రాజధాని నగరంలో మహిళా జడ్జిని వేధించి, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. తీస్ హజారీ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఫిర్యాదు మేరకు సందీప్ అనే ఆ డ్రైవర్‌ను గుర్గావ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 28వ తేదీన తాను ఉత్తర ఢిల్లీలోని ఓ మార్కెట్లో షాపింగ్ చేసేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నానని, షాపులోకి వెళ్తూ కాసేపు వేచి చూడాలని తాను డ్రైవర్‌ను కోరానని, అయితే రెండు నిమిషాలు గడిచాయో లేదో, ఆ డ్రైవర్ తనను నోటికి వచ్చినట్లు అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టాడని మహిళా జడ్జి చెప్పారు. ఆమె బ్యాగ్‌ను రోడ్డుమీద పారేశాడు. దాంతో ఓలా క్యాబ్ డ్రైవర్‌పై ఆమె బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో ఐపీసీ సెక్షన్లు 354 ఎ (మహిళలపై లైంగిక వ్యాఖ్యలు చేయడం), 509 (మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం లేదా ప్రవర్తించడం), 427 (మోసం చేయడం) కింద రూప్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టి, డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్
సిమ్లా: మహిళా జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో న్యాయమూర్తిని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఈ కేసులో దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు జడ్జి జూన్ 8న మనాలిలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మహిళా జడ్జి ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది. మాదకద్రవ్యాల నేరాలపై గత నెలలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు హాజరైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కంపెనీ ఇవ్వాలని బలవంతం చేయడమే కాకుండా... టీజ్ చేశారని, వేధించారని హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ చేపట్టారు. -
జడ్జిపై భర్త ఫిర్యాదు
అనంతపురం: తన భార్య, ఆమె తల్లిదండ్రుల నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓ జడ్జి భర్త టూటౌన్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదులోని వివరాలు.. అనంతపురం నగరం సాయినగర్‌కు చెందిన కె.జితేంద్రకు హైదరాబాద్‌లోని మియాపూర్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న శ్రీదేవితో ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది. వివాహమైన వారం నుంచి తన భార్యతో మనస్పర్థలు ప్రారంభమయ్యాయని, ఈ రోజు వరకు అలాగే ఉన్నాయని జితేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ గొడవలు భరించలేక తాను అనంతపురం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది ఆదిశేషారెడ్డితో కలిసి కోర్టులోనే ఉన్నానని వివరించారు. 6 గంటల ప్రాంతంలో ఇంటికెళ్లగా తన భార్య శ్రీదేవి, ఆమె నాన్న వెంకటేశ్వర్లు, అమ్మ అనురాధ, వారి మిత్రుడు శేఖర్ ఉన్నారని వివరించారు. తనను బలవంతంగా ఇంట్లోకి ఈడ్చుకెళ్లి విపరీతంగా దుర్భాషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు. దెబ్బలకు తాళలేక తప్పించుకుని ఇంటి నుంచి బయట పడి నేరుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నానని, మెడ, ఛాతి, నుదుటి మీద దెబ్బలు తగిలాయని వివరించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై టూటౌన్ సీఐ శుభకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ జితేంద్ర తన భార్య, అత్త, మామలు దాడి చేశారం టూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామన్నారు. -
మహిళా జడ్జిపై అత్యాచారం.. హత్యాయత్నం
ఉత్తరప్రదేశ్‌లో మహిళలు ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా కూడా వారికి ఏమాత్రం రక్షణ ఉండట్లేదు. చివరకు ఓ మహిళా జడ్జిని కూడా అక్కడి ముష్కరులు వదల్లేదు. అలీగఢ్‌లో ఓ మహిళా జడ్జిపై అత్యాచారం చేయడమే కాక, ఆమెపై హత్యాయత్నం కూడా చేశారు. ఆమె తన అధికారిక నివాసంలో స్పృహ లేకుండా పడి ఉన్నారు. ఆమెకు విపరీతంగా డ్రగ్స్ ఇచ్చి, ఆపై అత్యాచారం చేశారు. ఆమె శరీరంపై లెక్కలేనని్న గాయాలున్నాయి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ తెలిపారు. బాధితురాలు ఇంకా పూర్తిగా స్పృహలోకి రాకపోవడంతో ఇంకా ఆమెకు వైద్య పరీక్షలు ఏమీ చేయలేదని, ఆమెను విచారించే స్థితిలోకి వచ్చిన తర్వాతే చేయిస్తామని ఆయన అన్నారు. సగం ఖాళీ అయిన పురుగుమందు సీసా కూడా సంఘటన స్థలంలో ఉందని అధికారులు చెప్పారు. బహుశా భయంతోనే దుండగులు ఆమెకు బలవంతంగా పురుగుమందు తాగించి ఉంటారని అన్నారు. మహిళా జడ్జి పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో.. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.