లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్
సిమ్లా: మహిళా జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో న్యాయమూర్తిని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఈ కేసులో దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు జడ్జి జూన్ 8న మనాలిలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మహిళా జడ్జి ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది.
మాదకద్రవ్యాల నేరాలపై గత నెలలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు హాజరైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కంపెనీ ఇవ్వాలని బలవంతం చేయడమే కాకుండా... టీజ్ చేశారని, వేధించారని హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ చేపట్టారు.