నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు.. | Case Filed Against Actor Prakash Raj Over Chandrayaan-3 Post - Sakshi
Sakshi News home page

నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు..

Published Tue, Aug 22 2023 5:04 PM | Last Updated on Tue, Aug 22 2023 6:06 PM

Case Filed Against Actor Prakash Raj Over Chandrayaan 3 Post - Sakshi

బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకాలోని బాగాల్‌కోట్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్‌రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్‌లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు.

చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్‌లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు.  

ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్‌ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement