
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టగానే మొదటి మెసేజ్ ఇస్రో పంపించింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
'ఇండియా అంటే నేను లక్ష‍్యాన్ని చేరాను. మీరు కూడా. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం. శుభాకాంక్షలు.' చంద్రయాన్ 3 అంటూ పోస్టులో పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బ్రాడ్‌కాస్ట్ సౌకర్యం 5:20 నుంచే ప్రారంభమైంది.
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్‌పై పీఎం మోదీ..