Prakash Raj Shredded On Social Media For Mocking Chandrayaan-3 - Sakshi
Sakshi News home page

చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Aug 21 2023 2:00 PM | Last Updated on Mon, Aug 21 2023 2:27 PM

Prakash Raj Shredded On Social Media For Mocking Chandrayaan 3 - Sakshi

న్యూఢిల్లీ: సినీ నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్(ఒకప్పుడు ట్విటర్) వేదికగా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుండి పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను తీ వడపోస్తున్న ఫోటోను ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికార బీజేపీ పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో అప్డేటెడ్ గా ఉండే ప్రకాష్ రాజ్ ఈసారి మాత్రం తాను చేసిన విమర్శకు ప్రతిగా తాను విమర్శల పాలయ్యాడు. జూలై 14న భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆ అద్భుత క్షణం కోసం ఎదురుచూస్తోంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విజయవంతమైన ప్రయోగాన్ని అభినందించకపోగా సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశాడు. ఒక వ్యక్తి టీ వడపోస్తున్న ఫోటో పోస్ట్ చేసి చంద్రయాన్ నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫోటో.. వావ్.. అంటూ పోస్ట్ చేశాడు. 

ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అదే స్థాయిలో ప్రకాష్ రాజ్‎పై విమర్శలు కురిపించారు. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పులేదు కానీ.. ఏది పెడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు.   

ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement