బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలపై లోకాయుక్త కేసు నమోదు చేసింది.
2019లో పనిచేసిన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్(బీడీఏ)పైనా ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదైంది. బీడీఏ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు వీరంతా లంచాలు తీసుకున్నారంటూ సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం చేసిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కింది కోర్టు అబ్రహాం వేసిన పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. హైకోర్టు మాత్రం స్వీకరించింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు యడ్డీ, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని యడియూరప్ప వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఆప్‌లో చేరిక కన్నడ సినీ నటి
Comments
Please login to add a commentAdd a comment