సాక్షి, హైదరాబాద్ : యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై మరో కేసు నమోదైంది. సంతానం కోసం సులక్షణ రాణి అనే దంపతులు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ బ్రాంచ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో విశాఖపట్నం బ్రాంచ్‌లో సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తామంటూ యాజమాన్యం వీరి నుంచి డబ్బులు వసూలు చేశారు. విడతల వారీగా ఇప్పటి వరకు బాధితులు రూ.13 లక్షలు ఇచ్చారు. సృష్టి యాజమాన్యం చెప్పిన తేదీన బిడ్డ కోసం విశాఖపట్నం వెళ్లిన దంపతులకు.. సరోగసి చికిత్స తీసుకుంటున్న తల్లి కోవిడ్‌తో మృతి చెందిందని బుకాయింపు మాటలు చెప్పారు. దీంతో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయమంతా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (‘సృష్టి’ అక్రమాల్లో మరి కొన్ని నిజాలు)
Comments
Please login to add a commentAdd a comment