Srushti IVF Centre
-
సృష్టి కేసు: వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, విజయవాడ: యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చుస్తున్నాయి. పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు ఆసుపత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెజవాడ పోలీసులు జరిపిన లోతైన విచారణతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2018లోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సృష్టి ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేసింది. అయినప్పటికి డాక్టర్ నమ్రతా వేరే వారి లైసెన్స్‌తో సృష్టి ఆసుపత్రిని గుట్టుచప్పుడుగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: పేగుబంధంతో పైసలాట!) తెలంగాణలోని ఓ ఎన్ఆర్ఐకి టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని చెప్పి మోసం చేయడంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర రెడ్డి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు సృష్టి ఆసుపత్రిలో 37 మంది పిల్లలు జన్మించారు. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పరిశీలన చేయకుండా, రెగ్యులర్ మానిటరింగ్ లేకుండానే రెన్యూవల్ చేసినట్లు పోలీసులు చెప్పారు. 2015లో సృష్టి అక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు స్పత్రిపై విచారణ జరిపి మెడికల్ కౌన్సిల్ రిపోర్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని ఈ నేపథ్యంలో మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... ) -
సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై మరో కేసు నమోదైంది. సంతానం కోసం సులక్షణ రాణి అనే దంపతులు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ బ్రాంచ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో విశాఖపట్నం బ్రాంచ్‌లో సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తామంటూ యాజమాన్యం వీరి నుంచి డబ్బులు వసూలు చేశారు. విడతల వారీగా ఇప్పటి వరకు బాధితులు రూ.13 లక్షలు ఇచ్చారు. సృష్టి యాజమాన్యం చెప్పిన తేదీన బిడ్డ కోసం విశాఖపట్నం వెళ్లిన దంపతులకు.. సరోగసి చికిత్స తీసుకుంటున్న తల్లి కోవిడ్‌తో మృతి చెందిందని బుకాయింపు మాటలు చెప్పారు. దీంతో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయమంతా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (‘సృష్టి’ అక్రమాల్లో మరి కొన్ని నిజాలు) -
‘సృష్టి’ అక్రమాల్లో మరి కొన్ని నిజాలు
సాక్షి, విశాఖపట్నం: ఒక తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మరో తప్పు చేయాలి అంటారు. ఇప్పుడు సృష్టి ఆసుపత్రి అక్రమ వ్యవహారాల్లో అదే అంశం కనిపిస్తుంది. పేదరికం ఇతర వ్యవహారాల వల్ల పుట్టిన బిడ్డను పెంచుకోలేని మహిళలను టార్గెట్‌గా చేసుకుని విక్రయాలకు పాల్పడిన ‘సృష్టి’ యాజమాన్యం ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు క్రమంలో మరి కొన్ని తప్పులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. (డాక్టర్ నమ్రత మరో అక్రమ ‘కోణం’) ముఖ్యంగా సరోగసి పేరిట బిడ్డలను పుట్టిస్తానని కొందరు దంపతులు వద్ద భారీ మొత్తాన్ని తీసుకుని పేదరికంలో ఉన్న గర్భవతులకు పుట్టిన బిడ్డలను అప్పగించినట్టు తేలింది. అదే సమయంలో పుట్టిన బిడ్డను తిరిగి ఇవ్వాలని మహిళలు ఒత్తిడి తెస్తే మరో మహిళ బిడ్డను కూడా అప్పగించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కౌన్సిలర్‌తో పాటు నర్సులు, ఇతర సహాయకులు సృష్టి అక్రమాల్లో సహకరించినట్లు పోలీసుల విచారణలో బయట పడింది. లావణ్య అనే మహిళకు పుట్టిన బిడ్డని వేరొకరికి విక్రయించినట్టు గుర్తించామని విశాఖ డీసీపీ ఐశ్వర రస్తోగి తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏజెంట్ ఝాన్సీ, కౌన్సిలర్ బిందు, నర్సు కల్యాణితో పాటు ఆసుపత్రి సిబ్బంది వసంత, చంద్రమోహన్, సుజాత, వెంకటరమణలపై తాజాగా మరో కేసు నమోదు చేశామన్నారు. ఆడబిడ్డ పుడితే లక్షన్నర .. మగ బిడ్డ పుడితే రెండున్నర లక్షలు ఇస్తామని లావణ్యకు సృష్టి సిబ్బంది ఎర వేశారని, పుట్టిన బిడ్డని కోల్‌కత్తాలో దంపతులకు విక్రయించారని పేర్కొన్నారు. లావణ్య.. బిడ్డ గురించి ఒత్తిడి తేవడంతో బొబ్బిలిలోని ఓ మహిళకు పుట్టిన బిడ్డను ‘సృష్టి’ సిబ్బంది నాలుగు రోజుల పాటు ఇచ్చారని డీసీపీ తెలిపారు. మహిళల డెలివరీలో పనిచేసిన ఎనస్థిషియన్ డాక్టర్ల పాత్రపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఇద్దరు బిడ్డల డీఎన్ఏ పరీక్షల కోసం కోర్టు అనుమతిని పోలీసులు కోరారు. -
డాక్టర్ నమ్రత మరో అక్రమ ‘కోణం’
సాక్షి, తిరుపతి: శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్ పి.నమ్రత అక్రమాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. శిశువులతో వ్యాపారమే కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో చేతులు కలిపి భూలావాదేవీల్లోనూ అక్రమాలకు పాల్పడి ప్రజల నుంచి భారీ ఎత్తున నగదు దోచుకున్నట్లు వెలుగుచూసింది. తిరుపతి పద్మావతీపురానికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లికార్జున్, వెంకటనరసమ్మ దంపతుల దగ్గర రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానంటూ సుమారు రూ.27 లక్షలు కాజేసి మోసం చేసిందని బాధితులు సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి గోడు వెళ్లబుచ్చారు. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చలపతి ద్వారా తమకు డాక్టర్ నమ్రత పరిచయమైందన్నారు. 2008లో చిక్‌బళ్లాపూర్ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.58లక్షలు విలువజేసే రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానని చెప్పి అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవాలని నమ్మబలికిందని, 2008 జనవరిలో వడ్డీకి అప్పు తెచ్చి రూ.27లక్షలు డాక్టర్ నమ్రతకు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు సమయం ఉండటంతో తమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా 2010లో మళ్లీ తమను సంప్రదించి నిర్ణయించిన ధరకంటే అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండు చేసిందని పేర్కొన్నారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి సదరు భూమి వివరాలపై ఆరా తీయగా తమకు అగ్రిమెంట్ చేయించిన భూమిని 2008 మే నెలలో వేరేవారికి విక్రయించినట్లు తెలిసిందన్నారు. (పేగుబంధంతో పైసలాట!) ఈ విషయమై నిలదీయగా బెదిరింపులకు దిగిందని చెప్పారు. అప్పటి నుంచి 2014 వరకు పెద్ద మనుషుల పంచాయితీలతో కాలం గడిపిందని, 2015లో తాము హైదరాబాద్, విజయవాడ, చిక్‌బళ్లాపూర్‌లోని పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులతో కుమ్మక్కై కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసిందన్నా రు. ప్రభుత్వం, అధికారులు కలుగజేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
మళ్లీ కస్టడీలోకి డాక్టర్ నమ్రత
సాక్షి, విశాఖపట్నం: చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన సృష్టి ఆస్పత్రి ఎండీని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు. నమ్రతతో పాటు గర్భిణులకు డెలివరీ చేయడంలో సహకరించిన మరో డాక్టర్ తిరుమలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పేద గర్భిణీలు, పిల్లలులేని దంపతులను లక్ష్యంగా చేసుకొని పలు అక్రమాలకు సృష్టి నమ్రత పాల్పడినట్లు ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. ఇవాళ్టి నుంచి మరో రెండు రోజుల పాటు విశాఖ మహారాణిపేట పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. (పేగుబంధంతో పైసలాట!) -
నమ్రత కస్టడీ పొడిగింపు
సాక్షి, విశాఖపట్నం: పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణలపై యూనివర్షల్ సృష్టి హాస్పటల్ ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను నగర పోలీసులు మరో రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రంతో నమ్రత తొలిదశ పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే విచారణలో సరిగ్గా సహకరించకపోవడంతో మరోసారి డాక్డర్ నమ్రతని విచారించాలని పోలీసులు కస్టడీ పొడిగింపుని కోరారు. మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని జిల్లా కోర్డులో పోలీసులు మెమో దాఖలు చేశారు. అయితే రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నేటి నుంచి మరో రెండురోజులపాటు మహారాణిపేట పోలీసులు విచారించనున్నారు. (పేగుబంధంతో పైసలాట!) ఎంవీపీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కూడా కస్టడీ కోరే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సరోగసీ పేరుతో పిల్లల అక్రమ రవాణా, తప్పుడు డాక్యుమెంట్లు తయారీ, ఇతర డాక్టర్ల సహాకారం, ఇతర బ్రాంచ్‌లలో అక్రమాలపై డాక్టర్ నమ్రతని పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఆమె అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే స్పందించంది. నమ్రత వైద్యపట్టా రద్దు చేస్తూ.. అక్రమాలపై ప్రత్యేక విచారణకి ఆదేశాలు జారీచేసింది. అయితే గతంలోనూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైద్యపట్టా రద్దు చేసినా డాక్టర్ నమ్రత ప్రాక్టీస్ ఆపకపోవడం గమనార్హం. (సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు) -
సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు
సాక్షి, అమరావతి/విశాఖ : అక్రమంగా శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం యూనివర్సల్ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ ఆస్పత్రి కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. గత వారం రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న ఈ కేసును పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణ చేయనున్నారు. అలాగే ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి.నమ్రత వైద్య డిగ్రీని తక్షణమే సస్పండ్ చేయాలని మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇలాంటి కేసులను ఉపేక్షించేది లేదని, దీనిపై లోతుగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.బి.సాంబశివారెడ్డి ‘సాక్షి’తో అన్నారు. (సృష్టి: వెలుగులోకి ముగ్గురు మహిళా వైద్యులు పాత్ర) పోలీస్ కస్టడీకి డాక్టర్ నమ్రత ‘సృష్టి’ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పి.నమ్రతను విచారణ నిమిత్తం మహారాణిపేట పోలీసులు గురువారం కేంద్ర కారాగారం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పటివరకు సంతానం కావాలని హాస్పిటల్‌కు వచ్చిన 63 మందితో సరగోసి పద్ధతిలో పిల్లల్ని సమకూర్చేందుకు డా.నమ్రత ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు పద్మజ హాస్పటల్‌కు చెందిన డాక్టర్ పద్మజతో కలసి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా తెలిపారు.ఇప్పటికే ఈ కేసులో డాక్టర్ తిరుమల, రామకృష్ణ, కోడె వెంకటలక్ష్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం డాక్టర్ పద్మజతో పాటు ఏజెంటుగా వ్యవహరించిన ఎన్.నూకరత్నంను అదుపులోకి తీసుకున్నారు. (పేగుబంధంతో పైసలాట!) -
పేగుబంధంతో పైసలాట!
అక్రమార్జనకు రాజమార్గంగా వైద్య వృత్తిని మార్చేసింది కిరాతక డాక్టర్ నమ్రత. పేగుబంధాలను తెంచేసి లక్షలాది రూపాయల సంపాదనే లక్ష్యంగా పసికందులను విక్రయించేసింది. పోలీసులు తవ్వుతున్న కొద్దీ నమ్రత దురాగతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగషీ ముసుగులో పసికందుల అక్రమ రవాణా, విక్రయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ నమ్రతను మహారాణిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గురువారం ఆమెను కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చిన్నారి అక్రమ విక్రయం కేసు జూలై 30న నమోదయింది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సీతమ్మధారలో గల పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి డాక్టర్ నమ్రత దారుణాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మరోవైపు గడిచిన మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 మంది మహిళలకు సరోగషీ ద్వారా ప్రసవాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెల్లడించారు. ఏజెంట్ సాయంతో వలవేసి... విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం పంచాయతీకి చెందిన చందక వెంకటలక్ష్మి చోడవరం మండల కేంద్రంలోని పెద్దబజారులో గల డాక్టర్ జగ్గారావు ఆస్పత్రికి ఈ ఏడాది జనవరిలో పరీక్షల కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న నేమాల నూకరత్నం మాటలు కలిపి వెంకటలక్ష్మిని పరిచయం చేసుకుంది. తనతో వస్తే విశాఖపట్నంలో గల సృష్టి ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేయిస్తానని, ఆపరేషన్ అవసరమైనా ఉచితంగానే చేస్తారని నమ్మించింది. దీంతో బాధితురాలు ఆమె మాటలు నమ్మి ఈ ఏడాది జనవరి 30న ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో గల డాక్టర్ నమ్రత, రామకృష్ణ, డాక్టర్ తిరుమల, డాక్టర్ సరోజిని ఆమెను పరీక్షించి డెలివరీ కోసం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జనవరి 31న డెలివరీ చేసిన వైద్యులు ఆడపిల్ల పుట్టిందని, అయితే చనిపోయిందని చెప్పి నమ్మించారు. బిడ్డ చనిపోయినందుకు సంతాపం ప్రకటించడం తప్ప చేసేదేమీలేదని వెంకటలక్ష్మిని ఆస్పత్రి నుంచి ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేసేశారు. సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి డాక్టర్ పద్మజ ఇక్కడే తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన వెంకటలక్ష్మి కేస్ షీట్‌ను తారుమారు చేసేసింది. బిడ్డ తల్లి సీహెచ్.వెంకటలక్ష్మి పేరును మార్చివేసి... బిడ్డను అమ్ముతామని ముందుగానే ఒప్పందం చేసుకున్న విజయనగరానికి చెందిన తల్లిదండ్రుల పేరిట కేస్ షీట్‌ను డాక్టర్ పద్మజ తయారు చేసింది. జనన ధ్రువీకరణ పత్రాలు నిమిత్తం జీవీఎంసీకి రిపోర్టులు కూడా పంపించింది. రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకుని... చాలా కాలంగా తమకు పిల్లలు లేరని, ఆధునిక వైద్య పద్ధతుల్లో బిడ్డ పుట్టించాలని విజయనగరానికి చెందిన దంపతులు 2019 ఫిబ్రవరి, మార్చిలో సృష్టి ఆస్పత్రిలో డాక్టర్ పి.నమ్రత, డాక్టర్ తిరుమలను సంప్రదించారు. తమకు చాలా కాలం నుంచి పిల్లలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి సరోగషీ పద్ధతిలో పిల్లలు పుట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని నమ్మించారు. అందుకు మోత్తంగా రూ.13 లక్షల ఖర్చు అవుతుందని వసూలు చేశారు. ప్రణాళికలో భాగంగా వెంకటలక్ష్మిని తీసుకొచ్చాక... ఈ ఏడాది జనవరి 30, 31వ తేదీల్లో ఆస్పత్రికి రావాలని ఆ దంపతులకు చెప్పారు. ఆ ప్రకారం వారు సృష్టి ఆస్పత్రికి రాగా... అక్కడి నుంచి మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లి సరోగషీ పద్ధతిలో ఆడపిల్ల పుట్టిందని చూపించారు. అనంతరం ఫిబ్రవరి 6న బిడ్డను డిశ్చార్జి చేసి అప్పగించారు. (‘సృష్టి’ తీగలాగితే.. వెలుగులోకి ‘పద్మశ్రీ’) బండారం బయటపడిందిలా... ఇటీవల సృష్టి ఆస్పత్రి ఆరాచకాలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన బాధితురాలు వెంకటలక్ష్మి అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు పుట్టిన బిడ్డను కూడా డాక్టర్లు అమ్మేశారని, తనకు న్యాయం చేయాలని జూలై 30న ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బాధితురాలి రక్త నమూనాలు సేకరించి, సృష్టి ఆస్పత్రిలోని నమూనాలతో సరిపోల్చారు. వాటి ఆధారంగా బాధితురాలు వెంకటలక్షి్మని ఈ ఏడాది జనవరి 30న పద్మజ ఆస్పత్రికి డెలివరీ నిమిత్తం పంపినట్లు నిర్ధారించారు. రికార్డుల ప్రకారం 31న సిజేరియన్ చేసి ఆడబిడ్డను తీసినట్లు, అనంతరం మెడికవర్ ఆస్పత్రిలో చేర్చించి ఫిబ్రవరి 6న విజయనగరానికి చెందిన దంపతులకు విక్రయించేసినట్లు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహరంలో నిందితులైన పద్మజ ఆస్పత్రి డాక్టర్ సీహెచ్.పద్మజ, ఏజెంట్‌గా వ్యవహరించిన నేమాల నూకరత్నంను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ తిరుమలతోపాటు రామకృష్ణ, కోడి వెంకటలక్షి్మ, డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీలో నమ్రత వెల్లడించే విషయాలు ఆధారంగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (వెలుగు చూస్తున్న ‘సృష్టి’ నిర్వాకాలు) -
సృష్టి: వెలుగులోకి ముగ్గురు మహిళా వైద్యులు పాత్ర
సాక్షి, విశాఖపట్నం: సరోగసి ముసుగులో చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు నమ్రతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పలు కీలకాంశాలు తెలిసాయని సీపీ ఆర్కే మీనా తెలిపారు. గత మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 సరోగసి డెలివరీలు జరిగాయని వెల్లడించారు. చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి మరిన్ని కేసులు నమోదు అవుతున్నాయన్నారు. తాజాగా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో మరో చిన్నారి అక్రమ రవాణా కేసు నమోదయినట్లు తెలిపారు. డాక్టర్ నమ్రత, పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. ఈ క్రమంలో చోడవరానికి చెందిన ఓ మహిళ దగ్గర నుంచి డాక్టర్ నమ్రత 13 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందన్నారు. అంతేకాక మరో గర్బిణీ మహిళ వెంకటలక్ష్మి చోడవరంలోని జగ్గారావు ఆస్పత్రికి చెక్అప్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో సృష్టి ఆస్పత్రి ఏజెంట్లు తమ ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేస్తారని ఆమెను నమ్మించారని సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఆ తర్వాత సృష్టిలో చేరిన వెంకటలక్ష్మిని డెలివరీ కోసం పద్మజ ఆస్పత్రికి పంపి.. అక్కడే పురుడు పోశారన్నారు. అనంతరం బిడ్డ చనిపోయినట్లుగా ఆమెకు చూపించారన్నారు. ఆ తర్వాత అదే బిడ్డను మరొకరికి సరోగసీ పేరుతో అమ్మేసారని తెలిపారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత, పద్మజలతో పాటు మరో మహిళా డాక్టర్‌తో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన నర్సు నూకరత్నం అరెస్ట్ చేశామన్నారు. సృష్టి ఆస్పత్రిపై అనేక ఆరోపణలున్నాయని లోతుగా విచారిస్తున్నామని సీపీ ఆర్కే మీనా తెలిపారు. -
రెండు రోజులే కస్టడీకి అనుమతి
సాక్షి, విశాఖపట్నం : చిన్నారుల అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను విచారించడానికి మహారాణిపేట పోలీసులు మూడు రోజుల కస్టడీ కోరారు. అయితే రెండు రోజులకస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ మేరకు రెండవ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు అనుమతితో నేటి నుంచి రెండు రోజులపాటు డాక్టర్ నమ్రతను పోలీసులు విచారించనున్నారు. దీంతో చిన్నారుల అక్రమ రవాణాలో పలు కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. (అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా..) ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత ఎ 1 నిందితురాలిగా విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారుల అక్రమ రవాణాపై సెక్షస్ 468,471తో సహా జువైనల్ జస్టిస్ యాక్ట్ 2005కింద పలు కేసులను పోలీసులు నమోదు చేశారు. (‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... ) -
పసికందుల విక్రయం కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు
-
‘సృష్టి’ తీగలాగితే.. వెలుగులోకి ‘పద్మశ్రీ’
దొండపర్తి (విశాఖ దక్షిణ): పసికందుల అక్రమ విక్రయం వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న ‘సృష్టి’ ఆస్పత్రి తీగలాగితే... అక్కయ్యపాలెం హైవేపై ఉన్న పద్మశ్రీ ఆస్పత్రి డొంక కదులుతోంది. పసిపిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతను అరెస్టు చేసి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సృష్టి ఆస్పత్రిలో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా చేపట్టిన విచారణలో సీతమ్మధార సమీపంలో ఉన్న పద్మశ్రీ ఆస్పత్రితో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పద్మశ్రీ ఆస్పత్రిలో శనివారం తనిఖీలు నిర్వహించారు. (సెంట్రల్ జైలులో డాక్టర్ నమ్రత హంగామా) ఆస్పత్రి ఎండీ డాక్టర్ పద్మజను విచారించారు. లోపల సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసిపిల్లల అక్రమ రవాణా విషయంలో ఒక డెలివరీ పద్మశ్రీ ఆస్పత్రిలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పసిపిల్లల అక్రమ రవాణా వ్యవహారంపై ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతతో పాటు పద్మజ ఆస్పత్రిపైనా కూడా 120బీ, 417, 420, 370, అలాగే సెక్షన్ 81, 77 జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఆస్పత్రులతోపాటు నగరంలో ఉన్న మరికొన్ని ఆస్పత్రుల ద్వారా కూడా పసికందుల అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు ) సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం పద్మజ ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరిగాయి..?, పిల్లల అక్రమ రవాణాలో వీరి పాత్ర ఏంటనే అంశంపై పూరిస్థాయిలో దృష్టి సారించాం. దర్యాప్తులో భాగంగా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. పద్మజ ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ పద్మజను ఇప్పటికే విచారించాం. ప్రాథమిక దర్యాప్తునకు పూర్తిస్థాయిలో ఆమె సహకరించారు. ఈ విచారణలో భాగంగా సృష్టి ఆస్పత్రిపై ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదు చేశాం. పద్మజ ఆస్పత్రిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేయలేదు. కొద్ది రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం. ఎంవీపీ ఇన్చార్జి సీఐ అప్పారావు, ఎస్ఐ సూర్యనారాయణ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది. – మూర్తి, ద్వారక ఏసీపీ -
వెలుగు చూస్తున్న ‘సృష్టి’ నిర్వాకాలు
సాక్షి, విశాఖపట్నం: పసికందులతో వ్యాపారం సాగించిన విశాఖపట్నం యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి మోసాలు హైదరాబాద్‌లో కూడా బయటపడ్డాయి. అద్దె గర్భం (సరోగసీ) విధానంలో సంతానం అందజేస్తామని మోసం చేశారంటూ జూబ్లీహిల్స్ కి చెందిన దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు పిల్లలు కలగకపోవడం సరోగసీ ద్వారా సంతానం పొందాలని భావించి గత ఏడాది నవంబర్ 11న సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌ను సంప్రదించారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రత సరోగసీ విధానంలో శిశువును అందజేస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సరోగసీ మహిళ విశాఖపట్టణంలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారని బాధితులు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరులో శిశువును ఇవ్వాల్సి ఉంది. అయితే విశాఖపట్నంలోని ఇదే ఆసుపత్రి శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంతో అనుమతులు లేకుండా తమను మోసం చేస్తున్నట్లు గ్రహించిన ఆ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలోనూ ‘సృష్టి’ ప్రకంపనలు
రాంగోపాల్‌పేట్: విశాఖ పట్టణం కేంద్రంగా సరోగసీ పేరుతో సంతానం లేని దంపతుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ‘సృష్టి’ ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకాలు హైదరాబాద్ నగరంలోనూ వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన దంపతులకు సరోగతి ద్వారా శిశువు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు వివాహం జరిగి చాలా ఏళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో వారు గత నవంబర్ 11న సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ను సంప్రదించారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత సరోగసి (అద్దె గర్భం) ద్వారా శిశువును ఇస్తామని ఇందకు రూ.10లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో వారు అప్పటికప్పుడే రూ.10లక్షలు చెల్లించారు. అద్దె గర్భం ఇచ్చేందుకు అంగీకరించిన మహిళ విశాఖపట్టణంలోని తమ ఆస్పత్రిలో చికిత్సపొందుతుందని, ఈ ఏడాది అక్టోబర్‌లో శిశువును అప్పగిస్తామని చెప్పారన్నారు. అయితే ఇటీవల విశాఖపట్టణంలో సదరు ఆస్పత్రి సరోగసీ పేరుతో చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా సదరు ఆస్పత్రిలో సరోగసీ మహిళ ప్రసవించి శిశువును ఆస్పత్రికి అప్పగించి సొంతూరికి వెళ్లిపోయింది. అయితే ఆమె శిశువు లేకుండా ఇంటికి రావడంతో స్థానికులు దీనిపై ఆరా తీయడంతో వివాదానికి కారణమైంది. దీంతో శిశువును నగరానికి చెందిన దంపతులకు అప్పగించ లేదు. ఈ లోగా అక్రమాలు వెలుగులోకి రావడంతో నిర్వాహకులు సికింద్రాబాద్ ఆస్పత్రికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బాధితులు గురువారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా డాక్టర్ నమ్రత గత ఎనిమిదేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచే సరోగసీ పేరుతో శిశు విక్రయాలకు పాల్పడినట్లు సమాచారం. -
సెంట్రల్ జైలులో డాక్టర్ నమ్రత హంగామా
సాక్షి, విశాఖపట్నం: ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. పసిపిల్లల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. కోర్టు అనుమతితో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో రెండు బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. పేషెంట్ల వివరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు అన్నీ పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాము. డాక్టర్ నమ్రతని విచారిస్తే పసిపిల్లల అక్రమ రవాణా రాకెట్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయి' అని రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా అరెస్టయి విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న డాక్టర్ నమ్రతా అస్వస్థత పేరుతో బుధవారం హైడ్రామాను కొనసాగించారు. తనకి అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా సృష్టించారు. దీంతో ఆమెని జైలు సిబ్బంధి కేజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కేజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో కూడా నమ్రత హడావిడి చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కర్ణాటక దావణగిరిలో అదుపులోకి తీసుకునే సమయంలోనూ తనకు కరోనా ఉందంటూ పోలీసులని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. తాజాగా అనారోగ్యం పేరుతో మరో డ్రామాకు తెరలేపింది. కాగా.. హైకోర్టులో డాక్డర్ నమ్రత ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ కావడంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. (డాక్టర్ పచ్చిపాల నమ్రత అరెస్ట్) మరోవైపు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సెర్చ్ వారెంట్‌తో మధ్యాహ్నం నుంచి సృష్టి ఆస్పత్రి అణువణువునా తనిఖీ చేస్తున్నారు. మహారాణి పేట పీస్ సీఐ సోమశేఖర్, టూటౌన్ సీఐ వెంకట్రావుల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. సరోగసి కోసం వచ్చిన పేషేంట్ల వివరాలతో పాటు ఒక్కొక్క డెలివరీ కేసు వివరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో ఈ ఆస్పత్రి నుంచి 56 శిశు జననాలపై జీవీఎంసీ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. కేజీహెచ్‌కి చెందిన ఇద్దరు వైద్య నిపుణులు తనిఖీలలో పోలీసులకు సహకరిస్తున్నారు. తనిఖీలు అనంతరం కోర్డు అనుమతితో ఆసుపత్రి సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. (నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు) -
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో పోలీసుల తనిఖీలు
-
నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మహారాణి పేట సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సృష్టి ఆసుపత్రిలో తనిఖీలు, రికార్డులు పరిశీలన జరుగుతోంది. కోర్టు నుంచి వచ్చిన సెర్చ్ వారెంట్‌తో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలలో పోలీసులుకు సహకరించేందుకు కేజీహెచ్ నుంచి ఇద్దరు వైద్య నిపుణులు వచ్చారు. వైద్య పరంగా విచారించేందుకు మరో కమిటీ ఏర్పాటు చేయనున్న అధికారులు తెలిపారు. తనిఖీలు అనంతరం ఆసుపత్రి సీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ సాగిస్తున్నమని పోలీసులు తెలిపారు. పసికందుల విక్రయంతో కోట్లాది రూపాయలు సంపాదించిన ఆమె సామ్రాజ్యం చూసి పోలీసులు విస్తుపోయారు. మహారాణిపేట సీఐగా చౌదరి ఉన్నప్పుడే ఆమెపై పీఎం పాలెం, వాంబేకాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పరారైంది. అనంతరం ఇక్కడి నుంచి చౌదరి బదిలీకాగా కొత్త సీఐగా సోమశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే మళ్లీ ఫిర్యాదు రావడంతో సీఐ సోమశేఖర్ సృష్టి మాయలపై దృష్టిసారించారు. ఇంతలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు కూడా నిఘా పెట్టడం, మాడుగులలోని ఆశ కార్యకర్త సహకారంతో అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పి పరార్ పసికందుల విక్రయం వెలుగులోకి రావడంతోనే సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అప్రమత్తమయింది. విషయం తెలుసుకుని విజయవాడ పరారైంది. దీంతో ప్రత్యేక పోలీసులు బృందం ఎస్ఐ రమేష్ నేతృత్వంలో అక్కడికి వెళ్లడంతో విషయం తెలుసుకుని హైదరాబాద్ మకాం మార్చేసింది. పోలీసులు అక్కడకూ వస్తున్నారని తెలుసు కుని కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో గల బంధువుల ఇంటికి పరారైంది. దీంతో పోలీసులు ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సోమవారం దావణగిరిలో అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి కోర్టు ద్వారా ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని సోమవారం రాత్రి నగరానికి తీసుకొచ్చి కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, టెలికాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. బాధితులు పెరిగే అవకాశం! ఆమె నుంచి మరింత సమాచారం సేకరించేందుకుగాను తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కోర్టులో మెమో ఫైల్ చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో బాధితులు పెరిగే అవకాశం ఉందని సమాచారం. పసిపిల్లలను పెంచుకునేందుకు చాలా మంది పిల్లలు లేని దంపతులు సృష్టి ఆస్పత్రితో సంప్రదిస్తుండడంతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా చాలా మంది ఆస్పత్రి నిర్వాహకులను సంప్రదించినట్లు సమాచారం. పిల్లాడిని అప్పగిస్తామని చెప్పి ఒకరి నుంచి రూ.14లక్షలు కాజేసినట్లు తెలుస్తుంది. ఇంకా కొంత మంది ఫిర్యాదు చేసేందుకు సంసయిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటే నమ్రతను మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆమె కస్టడీ కోసం యతి్నస్తున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలపై దర్యాప్తు చేపట్టాలి ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): పిల్లల విక్రయ కేంద్రాలుగా మారుతున్న సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘం జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో విలేకరులతో ఆమె మాట్లాడారు. సంతాన సాఫల్య కేంద్రాల్లో ఐవీఎఫ్, సరోగసి పేరిట పేద మహిళలను మోసం చేసి పిల్లల విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారని ఆరోపించారు. సృష్టి ఆస్పత్రిపై 2010 – 13వ సంవత్సరం మధ్య కాలంలో ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ చేపట్టాలని కోరినా స్పందించలేదన్నారు. ఎంతో మంది పసిపిల్లలను అసాంఘిక కార్యక్రమాలకు, అవయవాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని కేంద్రాలపై విచారణ చేపట్టాలని కోరారు. ఆమెతోపాటు చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకులు డి.లలిత, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైఖ్య, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. విక్రయాలపై దర్యాప్తు జరిపించాలి అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో పసికందుల విక్రయాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ నగర సమితి కార్యదర్శి మరుపల్లి పైడిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనాలకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పేరుకు పెద్ద సాయం.. కానీ, అంతా మోసం
విశాఖపట్నం: పసి పిల్లల అక్రమ రవాణా కేసులో సృష్టి ఆస్పత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈకేసులో విశాఖ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఆస్పత్రి నిర్వాకాలు బయటపడ్తున్నాయి. ఒక్క విశాఖ బ్రాంచ్ లోనే గడిచిన ఏడాదిన్నర కాలంలో 56 శిశు జననాలు సంభవించాయి. శిశు జననాలన్నీ కుడా అక్రమ రవాణాగానే పోలీసులు భావిస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా జీవీఎంసీని అక్రమార్కులు తప్పుదోవ పట్టించారు. చిన్నారుల అక్రమ రవాణాలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండి డాక్డర్ నమ్రతదే ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతకు రిమాండ్) సినిమా కథ తలపిస్తుంది విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సాలోని గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెడికల్ క్యాంపుల పేరిట డాక్టర్ నమ్రత భారీగా నెట్ వర్క్ పెంచుకున్నారు. ఆశా వర్కర్ల ద్వారా ఏజెంట్లని నియమించుకుని ఇంట్లో సమస్యలున్న గర్బిణీలకి వల వేశారు. అక్రమాలు బయటపడకుండా గర్బిణీలకి తన ఆసుపత్రులలో ఉచిత డెలివరీ చేయించేవారు. డెలివరీ తర్వాత చిన్నారిని తీసుకుని తల్లులకి రూ. లక్ష నుంచి రెండు లక్షలు వరకు చెల్లించేవారని పోలీసులు గుర్తించారు. సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ డాక్టర్ నమ్రత చిన్నారుల అక్రమ రవాణా దందాను కొనసాగించారని పోలీసులు వెల్లడించారు. ఏడాదికి ఐదు ఆస్పత్రి బ్రాంచ్‌ల ద్వారా 200 పైనే చిన్నారుల అక్రమ రవాణాకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రతని విచారిస్తే భారీగా అక్రమాలు బయటకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. కాగా, ఆమెను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నేడు కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. సృష్టి ఆస్పత్రికి గల హైదరాబాద్‌లోని రెండు బ్రాంచ్‌లు, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కత బ్రాంచ్‌లలో విశాఖ పోలీసులు తనిఖీలు చేయనున్నారు. (ఆస్పత్రి మాటున అరాచకం) -
సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతకు రిమాండ్
అల్లిపురం (విశాఖ దక్షిణం): యూనివర్షల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రతను మహారాణిపేట పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పసిపిల్లల విక్రయం కేసులో మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ కేసులో ఆదివారం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా తెలిపారు. ఈ కేసులో కీలక నిందితురాలు, ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత పరారీలో ఉన్నందున ప్రత్యేక బృందాలు కర్ణాటక వెళ్లి అక్కడ ఆమెను సోమవారం అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విశాఖపట్నం తీసుకువచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి 10 గంటల సమయంలో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ భాను ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. -
పిల్లల అక్రమ రవాణా: డాక్టర్ పచ్చిపాల నమ్రత అరెస్ట్
-
విశాఖ కేంద్రంగా పసికందుల విక్రయం
-
డాక్టర్ పచ్చిపాల నమ్రత అరెస్ట్
సాక్షి, విశాఖ : మాతృత్వానికి నోచుకోని మహిళలకు వైద్యం అందించాల్సిన వైద్యురాలు పసికందులను విక్రయించడమే పనిగా పెట్టుకుంది. ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ముసుగులో కొన్నేళ్లుగా పసిపిల్లల్ని విక్రయిస్తోంది. గుట్టుగా సాగుతున్న ఈ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్ పచ్చిపాల నమ్రత పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్ణాటక రాష్ట్రం దావణగిరి ప్రాంతంలో డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ సాయంత్రం విశాఖ కోర్టులో హాజరు పరచనున్నారు. అలాగే నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. (సృష్టి హాస్పటల్దే కీలక పాత్ర) పిల్లల అక్రమ రవాణాలో సృష్టి ఆస్పత్రిదే కీలక పాత్ర. 2018లో ఆస్పత్రిలో కేసు నమోదు అయినా తీరు మారలేదు. పైగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా పేరు మార్చుకుని పిల్లల అక్రమ రవాణా దందాను కొనసాగించింది. విశాఖతో పాటు హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలో ఉచిత వైద్య శిబిరాల పేరిట అమాయకులపై వల విసిరి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దందా కొనసాగిస్తోంది. (ఆస్పత్రి మాటున అరాచకం) 2015 డిసెంబర్లో...‘సాక్షి’ లో స్టింగ్ ఆపరేషన్... ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతల వివరాలు సేకరించి, ఉచితంగా డెలివరీ చేయిస్తామంటూ విశాఖ సృష్టి ఆస్పత్రికి తరలించేవారు. డెలివరీ తర్వాత తల్లులకు కొంత మొత్తాన్ని ఇచ్చి పిల్లలు లేని ధనవంతుల దగ్గర పెద్ద మొత్తం వసూలు చేసి ఆ పసికందులను విక్రయించేవారు. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే చిన్నారులు పుట్టినట్లుగా తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించేవారు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఆస్పత్రి మాటున అరాచకం
సాక్షి, విశాఖపట్నం: వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన ముప్ఫై నాలుగేళ్ల వయసు గల మహిళ భర్త చనిపోయాడు. మరొకరితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఈ వ్యవహారం ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణకు తెలిసింది. ఇంకే ముంది వారు ఏజెంట్ అర్జిరామకృష్ణకు సమాచారం ఇచ్చారు. తర్వాత వీరు ముగ్గురూ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని నమ్మించారు. దీనికి సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆస్పత్రిలో సుందరమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారికి విక్రయించారు. చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో అంగన్వాడీ నుంచి పౌష్టికాహారం పొందేది. అక్కడ అంగన్వాడీ టీచర్ గుంటు సరోజిని ఆ మహిళ డెలివరీ విషయాన్ని తెలుసుకొని బిడ్డ విషయాన్ని అడిగింది. అందుకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అంగన్వాడీ టీచర్‌కు అనుమానం వచ్చి ఈ ఏడాది మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించింది. దీనిపై చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకువచ్చారు. చైల్డ్‌లైన్ సిబ్బంది బేబీని శిశుగృహలో చేర్పించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు జరిగిన విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ప్రస్తుత కేసుతో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి ముసుగులో పసిపిల్లల విక్రయాలు : సీపీ ఆర్కే మీనా చైల్డ్‌లైన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడితే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని సీపీ ఆర్కే మీనా చెప్పారు. ఆదివారం మీడియా సమావేశంలో సీపీ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. పిల్లలను విక్రయిస్తున్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రతతో పాటు ఓ డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లను, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను, పసిబిడ్డను కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిపి 8 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతతో పాటు ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ ఏ2, ఏ3లుగా, ఏజెంట్‌గా వ్యవహరించిన అర్జి రామకృష్ణను ఏ4గా, ఆస్పత్రి ఎండీ దగ్గర పనిచేస్తున్న వైద్యురాలు తిరుమలను ఏ5గా, ఎండీ దగ్గర పనిచేస్తున్న లోపింటి చంద్రమోహన్‌ను ఏ6గా, పసికందును కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరిని ఏ7, ఏ8గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎండీపై ఇప్పటికే రెండు కేసులు డాక్టర్ పచ్చిపాల నమ్రత జిల్లా పరిషత్ ప్రాంతంలో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. పసిపిల్లలను విక్రయించడం, ఇతరత్రా విషయాలపై ఆమెపై 2018లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో నాలుగు బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా కలిగే గర్భవతుల వివరాలను తెలుసుకునే వారు. ఆశా వర్కర్లనే ఆ బాలింతల దగ్గరకు వెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, ఆ బిడ్డలను ఆస్పత్రికి ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రత తన నెట్‌వర్క్‌ను విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలింతలకు డెలివరీ చేసి ఆ పసికందులను డబ్బున్న వారికి విక్రయించడాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసిన వారు తల్లిదండ్రులుగా, తమ ఆస్పత్రిలోనే డెలివరీ అయిన విధంగా ఆ పసికందుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను సైతం ఇప్పిస్తూ వస్తున్నారు. ఇదే విధంగా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన మహిళను కూడా నమ్మించి మార్చి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు ఆమె మగబిడ్డను జన్మనివ్వడంతో ఆ పసికందును పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులకు విక్రయించారు. ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ పర్యవేక్షణలో మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, గాజువాక క్రైం సీఐ పి.సూర్యనారాయణ, హార్బర్ సీఐ ఎం.అవతారం, మహారాణిపేట ఎస్ఐ పి.రమేష్ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. -
సృష్టి హాస్పటల్దే కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ ప్రాంతంలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నమ్రతను ఆమెకు సహకరించిన మరో వైద్యురాలు తిరుమల, ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ, పసికందును కొనుగోలు చేసిన తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. (ఆస్పత్రి మాటున అరాచకం) ► విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన జలుమూరి సుందరమ్మ(34) అనే మహిళకు భర్త చనిపోయాడు. మరొకరితో సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ► ఈ విషయం తెలుసుకున్న అదే మండలానికి చెందిన ఆశా కార్యకర్తలు, ఏజెంట్ అర్జి రామకృష్ణ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు. ► సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను ఈ ఏడాది మార్చి 9న యూనివర్సల్ సృష్టి హాస్పిటల్లో చేర్చగా.. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ► ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసిన తరువాత ఆస్పత్రి ఎండీ నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు విక్రయించారు. ► సుందరమ్మ గర్భవతిగా ఉండగా వి.మాడుగుల మండలంలో ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందేది. అక్కడి అంగన్వాడీ టీచర్ సరోజినికి సుందరమ్మ బిడ్డ విషయమై అనుమానం వచ్చి మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చింది. ► చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకొచ్చి శిశు గృహలో చేర్పించారు. ► అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పసికందుల విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ► డాక్టర్ నమ్రతను కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో అరెస్ట్ చేశామని, ఏజెంట్ అర్జి రామకృష్ణ, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులతోపాటు ముఠాలో మిగిలిన నలుగురినీ అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ చెప్పారు.