సాక్షి, విజయవాడ: యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చుస్తున్నాయి. పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు ఆసుపత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెజవాడ పోలీసులు జరిపిన లోతైన విచారణతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2018లోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సృష్టి ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేసింది. అయినప్పటికి డాక్టర్ నమ్రతా వేరే వారి లైసెన్స్‌తో సృష్టి ఆసుపత్రిని గుట్టుచప్పుడుగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: పేగుబంధంతో పైసలాట!)
తెలంగాణలోని ఓ ఎన్‌ఆర్‌ఐకి టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని చెప్పి మోసం చేయడంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర రెడ్డి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు సృష్టి ఆసుపత్రిలో 37 మంది పిల్లలు జన్మించారు. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పరిశీలన చేయకుండా, రెగ్యులర్ మానిటరింగ్ లేకుండానే రెన్యూవల్ చేసినట్లు పోలీసులు చెప్పారు. 2015లో సృష్టి అక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు స్పత్రిపై విచారణ జరిపి మెడికల్ కౌన్సిల్ రిపోర్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని ఈ నేపథ్యంలో మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... )
2018లోనే ఆస్పత్రి లైసెన్స్ రద్దు
Published Fri, Sep 4 2020 2:38 PM | Last Updated on Fri, Sep 4 2020 3:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment