
సాక్షి, విశాఖపట్నం: పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణలపై యూనివర్షల్ సృష్టి హాస్పటల్ ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను నగర పోలీసులు మరో రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రంతో నమ్రత తొలిదశ పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే విచారణలో సరిగ్గా సహకరించకపోవడంతో మరోసారి డాక్డర్ నమ్రతని విచారించాలని పోలీసులు కస్టడీ పొడిగింపుని కోరారు. మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని జిల్లా కోర్డులో పోలీసులు మెమో దాఖలు చేశారు. అయితే రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నేటి నుంచి మరో రెండురోజులపాటు మహారాణిపేట పోలీసులు విచారించనున్నారు. (పేగుబంధంతో పైసలాట!)
ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కూడా కస్టడీ కోరే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సరోగసీ పేరుతో పిల్లల అక్రమ రవాణా, తప్పుడు డాక్యుమెంట్లు తయారీ, ఇతర డాక్టర్ల సహాకారం, ఇతర బ్రాంచ్‌లలో అక్రమాలపై డాక్టర్ నమ్రతని పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఆమె అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే స్పందించంది. నమ్రత వైద్యపట్టా రద్దు చేస్తూ.. అక్రమాలపై ప్రత్యేక విచారణకి ఆదేశాలు జారీచేసింది. అయితే గతంలోనూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైద్యపట్టా రద్దు చేసినా డాక్టర్ నమ్రత ప్రాక్టీస్ ఆపకపోవడం గమనార్హం. (సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు)
Comments
Please login to add a commentAdd a comment