చేవెళ్ల ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో బస్‌డ్రైవర్ మురళీగౌడ్‌ను బ్రీత్‌అన్‌లైజర్‌తో పరీక్షిస్తున్న పోలీసులు
చేవెళ్ల: మద్యం సేవించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ బస్‌డ్రైవర్‌పై చేవెళ్ల పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్ కేసు నమోదు చేశారు. వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 07 యూఏ 2073) శంకర్‌పల్లి–చేవెళ్ల మధ్య తిరుగుతుంది. గురువారం ప్రయాణికులతో తిరుగుతున్న బస్సు డ్రైవర్ టి.మురళిగౌడ్ ప్రవర్తనలో ప్రయాణికులకు తేడా కనిపించింది.
దీంతోపాటు మద్యం సేవించినట్లుగా వాసనరావడంతో ప్రయాణికులు చేవెళ్ల బస్‌స్టేషన్‌లో బస్సును నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి బ్రీత్‌ఎన్‌లైజర్‌తో చెక్‌చేయడంతో డ్రైవర్ మురళీగౌడ్ మద్యం సేవించినట్లు 179 శాతం రిపోర్టు వచ్చింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment