సాక్షి, బెంగళూరు: ఒక విడాకుల కేసులో అమెరికాలో ఉన్న భర్తను భారతదేశానికి రప్పించేందుకు ఒక భార్య చేసిన న్యాయ పోరాటంలో అనుకూల తీర్పు వచ్చింది. వివరాలు.. అమెరికాలో ఉన్న భర్త, బెంగళూరులో ఉన్న భార్యతో విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణకు భర్త నేరుగా హాజరు కావాలని, వీడియో కాన్ఫరెన్స్ విచారణ సరికాదని కోర్టుకు భార్య విన్నవించింది.
అయితే ఆయన అమెరికా నుంచి రావడానికి అయ్యే రూ.1.60 లక్షల ఖర్చును మీరే భరించాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈ తీర్పుతో కంగుతిన్న మహిళ ఆ తీర్పును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. భార్య కోరినట్లు అతడు భౌతికంగా హాజరవ్వడంలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు పేర్కొంది. భర్త పేదవాడు కూడా కాకపోవడంతో ఆ ప్రయాణ ఖర్చులను అతడే భరించుకోవాలని, విచారణకు రావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment