Bangalore Family Court
-
విడాకుల కేసు.. అమెరికా నుంచి రావాల్సిందే
సాక్షి, బెంగళూరు: ఒక విడాకుల కేసులో అమెరికాలో ఉన్న భర్తను భారతదేశానికి రప్పించేందుకు ఒక భార్య చేసిన న్యాయ పోరాటంలో అనుకూల తీర్పు వచ్చింది. వివరాలు.. అమెరికాలో ఉన్న భర్త, బెంగళూరులో ఉన్న భార్యతో విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణకు భర్త నేరుగా హాజరు కావాలని, వీడియో కాన్ఫరెన్స్ విచారణ సరికాదని కోర్టుకు భార్య విన్నవించింది. అయితే ఆయన అమెరికా నుంచి రావడానికి అయ్యే రూ.1.60 లక్షల ఖర్చును మీరే భరించాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈ తీర్పుతో కంగుతిన్న మహిళ ఆ తీర్పును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. భార్య కోరినట్లు అతడు భౌతికంగా హాజరవ్వడంలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు పేర్కొంది. భర్త పేదవాడు కూడా కాకపోవడంతో ఆ ప్రయాణ ఖర్చులను అతడే భరించుకోవాలని, విచారణకు రావాలని ఆదేశించింది. -
విడాకులకు నటి అను ప్రభాకర్ దంపతుల అర్జీ
బెంగళూరు, న్యూస్‌లైన్ : నటి అనుప్రభాకర్, కృష్ణకుమార్ దంపతులు విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో అర్జీ సమర్పించారు. బుధవారం ఇద్దరు వేర్వేరుగా విడాకుల కోసం అర్జీ దాఖలు చేశారు. అలనాటి బహుభాష నటి జయంతి కుమారుడు కృష్ణకుమార్, కన్నడ నటీన టులు ఎంవీ. ప్రభాకర్, గాయత్రీ ప్రభాకర్‌ల కుమార్తె అనుప్రభాకర్ వివాహం 2002 మార్చి నెలలో జరిగింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకు రూ. కోటి భరణం ఇవ్వడానికి కృష్ణకుమార్ అంగీకరించారు. ఇదే విషయంపై ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. ఒకటి రెండు రోజులలో వీరి అర్జీ విచారణకు వచ్చే అవకాశం ఉంది.