
న్యూఢిల్లీ: భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు నమోదైంది. సుశీల్‌కు చెందిన ఛత్రశాల్ స్టేడియం లోపల మంగళవారం రాత్రి జరిగిన గొడవలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. దాంతో ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల సుశీల్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు ఆఫీసర్ కుమార్ తెలిపారు. సుశీల్ ప్రస్తుతం అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నామని కుమార్ తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment