![Police Registered Case Against An Author At Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/9/delhi_0.jpg.webp?itok=L-A9H8C0)
సాక్షి, న్యూఢిల్లీ: ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత. ఆయన రచనలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇందంత ఒకవైపు.. మరోవైపు మాత్రం అతను ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడు. అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన మహిళ(32) .. ఢిల్లీలోని తిమ్మార్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందని, అనంతరం వారద్దరూ ప్రేమించున్నట్టు పేర్కొంది. 2013లో తనకు కంటి నొప్పి రావడంతో ఎయిమ్స్ చికిత్స చేపించుకుని తిరిగి వచ్చేసరికి ఆలస్యమైందని తెలిపింది. లేట్ అయినందుకు అతను కోపంతో తనను తీవ్రంగా కొట్టాడని, ఓ వైపు తాను ఏడుస్తున్నా తనపై అత్యాచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, తర్వాత రోజు అతను తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు పేర్కొంది. ఇలా పెళ్లి పేరుతో అతడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని వాపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నిందితుడి ఫోన్‌ను బాధితురాలు చెక్ చేయగా అతడికి మరికొంతమంది మహిళలతో సంబంధం ఉన్నట్టు గుర్తించానని పేర్కొంది. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్
Comments
Please login to add a commentAdd a comment