BJP MLA Raja Singh.. సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం, కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.
ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌కు తాజాగా మరో ఊహించని షాక్ తగిలింది. పోలీసులు మరోసారి రాజాసింగ్‌కు నోటీసులు పంపించారు. పాత కేసులకు సంబంధించి రెండు కేసుల్లో 41(A) సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలకు సంబంధించి రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళ్‌హట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో, షాహినాయత్‌గంజ్ పీఎస్‌లో క్రైమ్ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. ఇక, రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను మళ్లీ అరెస్ట్ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటి’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏ మతాన్నీ కించపరచలేదు: రాజాసింగ్
Comments
Please login to add a commentAdd a comment