సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. అనుమతులు లేకుండా గురువారం చలో రాజ్‌భవన్ నిర్వహించినందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా పది మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావుతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతల పేర్లను చేర్చారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారని, అనుమతి లేకుండా రాజ్‌భవన్ ముట్టడికి వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పదమూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. జన జీవనానికి ఇబ్బంది కలిగించడమే కాకుండా .. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ప్రస్తావించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment