Surender Koli
-
కోలీకి నేడే ఉరి ?
మీరట్: ఎందరో బాలికలను దారుణంగా హతమార్చి, అత్యాచారం చేసిన సురీందర్ కోలీకి సోమవారం ఉరిశిక్ష విధించవచ్చని తెలుస్తోంది. ఇతడు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరితీయడం ఖాయమని మీరట్ జైలువర్గాలు తెలిపాయి. సీబీఐ కోర్టు డెత్ వారంటు జారీ చేయడంతో శిక్ష అమలు కోసం ఇతణ్ని ఈ నెల నాలుగున ఘజియాబాద్ దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. ఇతణ్ని ఈ నెల 7-12 తేదీల్లో ఎప్పుడైనా ఉరితీయవచ్చని అధికారులు ఇంతకుముందు ప్రకటించారు. ఉరి అమలుపై అధికారికంగా ఎవరూ నోరు విప్పకున్నా.. సోమవారం ఉదయం 5.30 గంటలకు శిక్షను అమలు చేస్తారని జైలువర్గాలు తెలిపాయి. కోలీని ఉరి తీయడానికి అవసరమైన పరికరాలను ఇది వరకే తెప్పించామని జైలుసూపరింటెండెంట్ తెలిపారు. యజమాని పంధేర్తో కలసి నోయిడాలోని నిఠారీ బాలిక రింపా హల్దార్ను 2006లో హత్య చేసినందుకు సీబీఐ కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది. -
సురేందర్ కోలీకి రేపే ఉరి?
మీరట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి సోమవారం ఉదయం ఉరి తీసే అవకాశం ఉందని మీరట్ జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4 తేదిన కోలీని గజియాబాద్ లోని దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7 తేది నుంచి 12 తేది లోపల ఏ రోజైనా ఉరితీసే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే కోలీ ఉరిపై అధికారుల నోరు మెదపనప్పటికి.. సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీసే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు.. కొక్కెం జైలు అధికారులకు అందాయని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్ఎమ్ రిజ్వీ తెలిపారు.