
విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి
హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతించిన ప్రకారం 2014 మార్చి 31 వరకు ఆయన ఢిల్లీ వెళ్లిరావడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ కోర్టు విజయసాయి రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలసిందే.