హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయలు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లకూడదని కూడా కోర్టు షరతు విధించింది.