ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సోమవారం డిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తొలి తీర్పు వెలువరించింది. ఈ కేసులో జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్), ఆ సంస్థ ఇద్దరు డైరెక్టర్లు ఆర్ఎస్ రంగ్తా, ఆర్సీ రంగ్తాలను కోర్టు దోషులుగా తేల్చింది. తప్పుడు ద్రువపత్రాలను సమర్పించి వీరు విలువైన గనులను దక్కించుకున్నట్లు కోర్టు నిర్థారించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న వీరిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మార్చి 31న వెలువరించనున్న తుది తీర్పులో వీరికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.