
'నాపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటా'
హైదరాబాద్ : తనపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఎవరినో కాపాడుకునేందుకు తనను బలి చేశారని ఆయన సోమవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణానికి సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోల్గేట్ స్కామ్లో ఈ నెల 22న దాసరి కోర్టుకు హాజరు కానున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.