మన్మోహన్ సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. మన్మోహన్ సింగ్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సీబీఐ కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చరాదని, సమన్లు జారీ చేయబోమని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో మాజీ పీఎం ప్రమేయం ఉందని, ఆయనకు సమన్లు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సీబీఐ మన్మోహన్ సింగ్కు క్లీన్ చిట్ ఇచ్చింది.
కోల్ గేట్ స్కాంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.