ఆ కుంభకోణంలో తొలి తీర్పు
న్యూఢిల్లీ
ఎట్టకేలకు బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తొలి తీర్పు వెలువరించింది. నకిలీ ధృవ పత్రాలు సమర్పించి బొగ్గు గనులు దక్కించుకున్న జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరు డైరెక్టర్లకు శిక్షలను ఖరారు చేస్తూ సీబీఐ జడ్జ్ భరత్ పరాశర్ తీర్పును వెలువరించారు. కోల్ మైనింగ్ అనుమతి కోసం జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తా లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసగించారన్న ఆరోపణలను కోర్టు సమర్ధించింది. ఈ నేపథ్యంలో వారికి కోర్టునాలుగేళ్ల జైలుశిక్షతోపాటు ,రూ .5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతోపాటుగా కంపెనీ 25 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
గత నెలలు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇద్దరిని దోషులుగా నిర్దారించిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని గత వారం పోలీసు అధికారులను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇరువురు ఇస్సాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నేర పూరిత కుట్ర, మోసానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది.. గత యేడాది మార్చి 21న వివిధ సెక్షన్ల కింద సీబీఐ అధికారులు వీరిపై కేసు నమోదు చేయగా కోర్టు విచారణ జరిపి ఇవాళ తీర్పు వెలువరించింది.