దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆరుషి-హేమరాజ్ జంట హత్యల కేసులో సీబీఐ కోర్టు ఈ నెల 25న తీర్పు వెలువరించనుంది.
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆరుషి-హేమరాజ్ జంట హత్యల కేసులో సీబీఐ కోర్టు ఈ నెల 25న తీర్పు వెలువరించనుంది. కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌ల తరఫు న్యాయవాది తుది వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి సెషన్స్ జడ్జీ శ్యామ్‌లాల్ తీర్పును 25కు వాయిదా వేశారు. ఆది నుంచి ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో సీబీఐ కూడా అనేక సందర్భాల్లో భిన్నమైన ప్రకటనలు చేసింది.
చివరకు తల్వార్ దంపతులే ఆరుషి-హేమరాజ్‌లను చంపారన్న తన వాదనకు కట్టుబడడంతో విచారణ తుది అంకానికి చేరింది. ఇక డిఫెన్స్ న్యాయవాది మాత్రం తల్వార్ దంపతులకు కావాలనే ఈ కేసులో ఇరికించారని వాదించారు. ఇలా 15 నెలలుగా విచారణ సాగుతున్న ఈ కేసుపై మరో 12 రోజుల్లో తీర్పు వెలువడనుంది.