కోల్కతా, లక్నో వెళ్లేందుకు జగన్కు కోర్టు అనుమతి | CBI Court permitted to YS Jagan to go to Kolkata and Lucknow | Sakshi
Sakshi News home page

కోల్కతా, లక్నో వెళ్లేందుకు జగన్కు కోర్టు అనుమతి

Published Tue, Nov 19 2013 4:19 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

కోల్కతా, లక్నో వెళ్లేందుకు జగన్కు కోర్టు అనుమతి - Sakshi

కోల్కతా, లక్నో వెళ్లేందుకు జగన్కు కోర్టు అనుమతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కోల్కతా, లక్నో వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కోల్కతా, లక్నో వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక  కోర్టు అనుమతి ఇచ్చింది.  జగన్ రేపు కోల్కతా వెళతారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నో వెళతారు. అక్కడ  సమాజ్‌వాది పార్టీ అధినేత మూలాయం సింగ్‌ యాదవ్‌ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కలుస్తారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జాతీయ నాయకులను కలుస్తున్నదానిలో భాగంగా జగన్ వారిని కలుస్తారు.  రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వారికి వివరిస్తారు. పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాలని వారిని కోరతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement