![Arguments Concluded In CBI Court On Bhaskar Reddys Bail Petition - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/6/Bhaskar-reddy.jpg.webp?itok=UGthRVYl)
భాస్కర్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)
హైదరాబాద్: వివేకా కేసుకు సంబంధించి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈనెల9వ తేదీన తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు
సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారు.
ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో సీబీఐ ఇరికించింది. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి నేరం చేసాడు అనడానికి ఎక్కడ సరైన సాక్ష్యాలు లేవు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదు’ అని కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment