నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో ఉన్న సీబీఐ ప్రధాన కోర్టును గాంధీభవన్ ఎదురుగా ఉన్న గగన్‌విహార్ భవన సముదాయంలోకి మార్చారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో ఉన్న సీబీఐ ప్రధాన కోర్టును గాంధీభవన్ ఎదురుగా ఉన్న గగన్‌విహార్ భవన సముదాయంలోకి మార్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఈ కోర్టు సామాగ్రిని తరలించారు. గగన్‌విహార్‌లోనే 12వ అంతస్తులో ప్రస్తుతం న్యాయమూర్తి లేకుండా ఖాళీగాఉన్న సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టులోనే ప్రధాన కోర్టుకు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నుంచి న్యాయమూర్తి కేసులను ఇక్కడి నుంచే విచారించనున్నారు.