నిమ్మగడ్డకు తాత్కాలిక బెయిల్ మంజూరు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్మోహనరెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్న నిమ్మగడ్డకు రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది. నిమ్మగడ్డ బెయిల్‌కు సంబంధించిన పిటిషన్ ను మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ బెయిల్‌కు సంబంధించి కేసును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. మోపిదేవి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.