nimma gadda prasad
-
నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రస్ అల్ ఖైమా (రాక్) ఫిర్యాదు మేరకు సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ శుక్రవారం విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వాన్‌పిక్‌లో పెట్టుబడులకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని రస్ అల్ ఖైమా యాజమాన్యం యూఏఈ కోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. అక్కడి కోర్టు నుంచి లుకౌట్ నోటీసులు పొందిన రాక్ వాటి ఆధారంగా ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో బెల్గ్రేడ్లో దిగిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు అక్రమమని, వాన్‌పిక్ ప్రాజెక్టు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న కారణంగా ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఇందులో ప్రసాద్ తప్పేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి కార్యాలయానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రసాద్‌ను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసాద్ తరఫున న్యాయవాదులు విడుదలకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయన శుక్రవారం విడుదలైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వివాదమేంటి? ప్రకాశం జిల్లాలో చేపట్టిన వాన్‌పిక్ ప్రాజెక్టుకు రస్ అల్ ఖైమా స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్ ను గతంలో ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులో రాక్ 26% వాటా తీసుకొని దాదాపు రూ.535 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. తర్వాత తలెత్తిన న్యాయపరమైన వివాదాల వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టుకోసం భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన భూములను సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. దీంతో ప్రధాన భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు సైతం అం దులో ఇరుక్కుపోయాయి. తమ పెట్టుబడులపై తగిన రాబడి రాలేదంటూ తాజాగా రాక్.. యూఏఈ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్జుడికేటింగ్ అథారిటీ చేసిన ఈ అటాచ్మెంట్ సరికాదంటూ గతవారమే ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. ఆస్తులను జప్తు నుంచి విడుదల చేస్తూ రూ.235 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కోరింది. దీంతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకు లు తొలగినట్లు అయింది. అదేసమయంలో బెల్గ్రేడ్లో నిమ్మగడ్డ అరెస్టు కావడం గమనార్హం. -
బెయిల్ ఇవ్వండి.. ప్రత్యేక కోర్టులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి తరఫున న్యాయవాదులు మంగళవారం ప్రత్యేక కోర్టులో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు 16 నెలలకుపైగా తాము రిమాండ్‌లో ఉన్నామని, ఈ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగా గతంలో తమ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యిందంటూ సీబీఐ తాజాగా మెమో దాఖలు చేసిన నేపథ్యంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించామని, తదుపరి విచారణకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని నివేదించారు. వీరి పిటిషన్లను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారించారు. కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. 16 నెలలుగా రిమాండులో: నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ... గత ఏడాది ఆగస్టు 13న చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంకా దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న సీబీఐ అభ్యంతరంతో నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు పూర్తయ్యాక బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. -
నిమ్మగడ్డకు తాత్కాలిక బెయిల్ మంజూరు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్మోహనరెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్న నిమ్మగడ్డకు రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది. నిమ్మగడ్డ బెయిల్‌కు సంబంధించిన పిటిషన్ ను మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ బెయిల్‌కు సంబంధించి కేసును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. మోపిదేవి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.