జగన్ రేపు ఉదయం విడుదల | YS Jagan to be released tomorrow morning | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 23 2013 8:32 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చంచల్గూడ జైలు నుంచి రేపు ఉదయం విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు సమయం మించిపోయినందున జగన్ రేపు విడదల అవుతారని చెప్పారు. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జగన్ తరపు న్యాయవాదులు పూచీకత్తులను రేపు సమర్పిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement