సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని దాల్మియా సిమెంట్ లిమిటెడ్ ప్రతినిధి పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిదంబరం చేసిన వాదనలతో తాము ఏకీభవించడం లేదని కోర్టు పేర్కొంది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ తీర్పు వెలువరించారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పునీత్ దాల్మియా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇటీవల విచారించి తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ పుర్కర్ సోమవారం తీర్పు వెలువరించారు.
దాల్మియా పిటిషన్లు కొట్టివేత
Published Tue, Mar 1 2016 6:03 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement
Advertisement