'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి' | Unemployed' Lalu Yadav Floating Stories On Congress Split: Nitish Kumar | Sakshi

'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి'

Sep 4 2017 5:01 PM | Updated on Jul 18 2019 2:17 PM

'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి' - Sakshi

'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి'

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓ నిరుద్యోగి(పరోక్షంగా పని పాట లేని వ్యక్తి) అని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు.

పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓ నిరుద్యోగి(పరోక్షంగా పని పాట లేని వ్యక్తి) అని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. అందుకే మరో పనిలేక తనపై కట్టుకథలు అల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం తప్ప మరో పని గురించి ఆలోచించే తీరికే లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నాల్లో నితీశ్‌ కుమార్‌ ఉన్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.

'లాలూజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. మీరు (మీడియా ప్రతినిధులు) కూడా ఓ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడు కొంతమందిని తన జేబులో పెట్టుకోవడం లాలూకు అలవాటు. అలా ఉండటానికి కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చక బయటకు వెళుతున్నారు. దీంతో వారిని నైతికత లేనివారిగా అభివర్ణించడమే కాకుండా, మమ్మల్ని తప్పుబడుతున్నారు. కానీ, ఇందులో మా ప్రమేయం లేదు. బిహార్‌ అభివృద్ధికే మేం కట్టుబడి ఉన్నాం. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది' అని నితీశ్‌ హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement