సీఎం నితీశ్‌కు లాలూ షాక్‌! | No question of Tejashwi resigning, says Lalu | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: సీఎం నితీశ్‌కు లాలూ షాక్‌!

Published Wed, Jul 12 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

సీఎం నితీశ్‌కు లాలూ షాక్‌!

సీఎం నితీశ్‌కు లాలూ షాక్‌!

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు మిత్రపక్ష నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ షాక్‌ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్‌ నాలుగురోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలన్న నితీశ్‌ అల్టిమేటంను లాలూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.  ల్యాండ్‌ ఫర్‌ హోటల్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ నాలుగురోజుల్లో రాజీనామా చేయాలని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే.

లాలూ, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులపై సీబీఐ దాడులు నిర్వహించిన నేపథ్యంలో లాలూ తొలిసారి 'ఇండియా టుడే'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నితీశ్‌కుమార్‌ క్యాబినెట్‌ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్‌ చేసేందుకే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. ' హోటల్‌ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్‌. క్రికెట్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం' అని లాలూ కొట్టిపారేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement