వాళ్లు పిండి తింటారా, డేటా తింటారా?
న్యూఢిల్లీ: జియో 4జీ డేటా సర్వీసులకు సంబంధించి రిలయన్స్ ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను వాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మిస్టర్ రిలయన్స్ అంటూ మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ వ్యవహారంపై తనదైన శైలిలో మోదీపై విరుచుకుపడ్డారు.
'పేదవాళ్లు ఏం తింటారు. డేటానా లేక గోధుమ పిండా?. డేటా చౌకగా లభిస్తుంటే, గోధుమ పిండి ధరలు మాత్రం ప్రియమయ్యాయి. దేశాన్ని మారుస్తున్నామనడానికి ఇదేనా మీరిచ్చే నిర్వచనం. కాల్ డ్రాప్ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో మీరే చెప్పండి' అంటూ హిందీలో లాలూ ట్విట్ చేశారు.
गरीब डाटा खायेगा या आटा? डाटा सस्ता,आटा मंहगा
— Lalu Prasad Yadav (@laluprasadrjd) 3 September 2016
यही इनकी देश बदलने की परिभाषा है।लगे हाथ ये भी बता दो, काल ड्रॉप की समस्या कौन सुलझाएगा?