corrupt politicians
-
నోటుకు ఓటుపై ఎలా వేటు వేయాలి?
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దయిన విషయం తెల్సిందే. నోట్ల కట్టలను ఎలా నీట్‌గా ప్యాక్ చేశారో, వాటిపై వార్డు నెంబర్లను ఎలా ప్రింట్ చేశారో, స్థానిక కెనరా బ్యాంక్ అధికారిని పట్టుకొని డబ్బు మొత్తాన్ని ఎలా రెండు వందల రూపాయల నోటుగా మార్చారో వివరిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ సమగ్రమైన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించడం, ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేనందున ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా ఆ నివేదికలో ఎన్నికల కమిషన్ సూచించడం, అందుకు అంగీకరించిన రాష్ట్రపతి మంగళవారం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వెల్లూరు నుంచి లోక్‌సభకు డీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ కోశాధికారి దురై మురుగన్ కుమారుడు కతీర్ ఆనంద్ పోటీ చేస్తున్నారు. ముందుగా మురుగన్ ఇంటిపై దాడులు జరిపిన ఆదాయం పన్ను శాఖ అధికారలు ఆ తర్వాత దురై మురుగన్ మిత్రుడి ఫ్యాక్టరీలో దాడులు జరపగా 11.50 కోట్ల రూపాయలు పట్టుపడ్డాయి. అవన్ని కూడా 200 రూపాయల నోట్లే కావడం గమనార్హం. ఎన్నికలను పురస్కరించుకొని తమిళనాడులో తాము నిర్వహించిన సోదాల్లో ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అధికారుల సోదాలో ప్రతిపక్షమైన డీఎంకే అభ్యర్థుల వద్దనే కాకుండా పాలకపక్ష అభ్యర్థుల వద్ద కూడా డబ్బు పట్టుబడుతున్నప్పుడు అధికార పక్షాన్ని వదిలేసి తమ అభ్యర్థులపైనే కేసులు పెడుతున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తన సోదరి కనిమోళి ఇంటిని సోదా చేయడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలకపక్ష ఏఐఏడీఎంకే వద్ద పంచడానికి ఉద్దేశించిన 640 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ‘ది వీక్’ పత్రిక వెల్లడించింది. ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ తర్వాత ఏడాదికి డాక్టర్ రాధాకష్ణన్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా 80 కోట్ల రూపాయలు పట్టుబడడంతో అప్పుడు ఆ ఎన్నికను రద్దు చేశారు ఇప్పుడు వెల్లూరు ఎంపీ ఎన్నికలను అలాగే రద్దు చేశారు. ఎన్నికల రద్దు వల్ల అవినీతి ఆగదని తేలిపోయింది. కఠిన చర్యలు తీసుకుంటేగానీ ఈ అవినీతి పోదు. నోట్లతో పట్టుబడ్డ వారిపై కేసులు పెట్టి వారికి శిక్షపడేలా చేయాలి. ఆ డబ్బులు ఏ అభ్యర్థి ఎన్నిక కోసం ఖర్చు పెడుతున్నారో కనుక్కొని సదరు అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవాలి. అంతవరకు ఎన్నికలకు అవినీతి మకిలి అంటుకూనే ఉంటుంది. -
ఉపాధిహామీలో అవినీతి మట్టి
వలస బతుకుల్లో వెలుగులు నింపాలని, వాళ్లకి పట్టెడు అన్నం పెట్టాలని ప్రారంభించిన ఉపాధిహామీ పథకం అధికార పార్టీ నాయకుల ధనదాహానికి బలవుతుంది. కోట్లు కొల్లకొడతూ కూడు లేక అలమటించే బతుకుల్లో నిర్వేదం నింపుతున్నారు. కూలీలది బతుకుపోరాటం అయితే నాయకులది కాసుల ఆరాటం. ఉపాధి పనుల్లో 18 కోట్లు దోచుకుని 22 మంది ఉద్యోగుల కొలువులు పోగొట్టుకోవడానికి కారణం అయ్యారు పచ్చనేతలు. సాక్షి, త్రిపురాంతకం(ప్రకాశం): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని సొంతానికి వాడేసుకున్నారు అధికారపార్టీ నాయకులు. ఈ అక్రమాలు సామాజిక తనిఖీల్లో బయటపడటంతో 22 మంది ఉపాధిహామీ ఉద్యోగాలను విధుల నుంచి తొలగించారు. రైతుల కోసం వ్యవసాయ క్షేత్రాల్లో మంజూరైన నీటి సంజీవని కుంటల్లో జరిగిన అక్రమాలకు ఇది నిదర్శనం. త్రిపురాంతకం మండలంలో 2016–2017 సంవత్సరంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు 9వ విడత సామాజిక తనిఖీ బృందాలు నిర్దారించాయి. ఈ అక్రమాలన్నీ ఫారం పాండ్ నీటి కుంటలు తీసేందుకు చేపట్టిన పనుల్లోనే జరిగాయి. 600 నీటి కుంటల్లో ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. దీంట్లో 18 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. 25లక్షల రూపాయలను ఉపాధి సిబ్బంది నుంచి రికవరీ చేశారు. నీటి కుంటలను కూలీలతో తీయించాల్సి ఉండగా మిషన్లు వినియోగించి తీయడం, కొన్ని నామమాత్రంగా చూపించారు, కొన్ని అసలు తీయకుండానే నిధులు స్వాహా చేశారు.అప్పట్లో పనిచేసిన సిబ్బందిపై అధికారపార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకున్నట్లు ఉపాధిసిబ్బంది నెత్తీనోరుబాదుకున్నారు. రాజకీయ ఒత్తిల్లకు తలొగ్గి పనిచేసినందుకు వాళ్లు భారీగా మూల్యం చెల్లించకతప్పలేదు. 14 మంది ఎఫ్‌ఏలు, 4 టిఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు ఏపిఒ, ఈసి ఒక్కొక్కరు చొప్పున విధుల నుంచి తాత్కాలికంగా తప్పించగా, గత నెల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆదేశాలు అందాయి. ఇదే జాతీయ ఉపాదిహామీ పథకంలో చేసిన అక్రమాలకు నగదు తీసుకుంటుండగా త్రిపురాంతకం ఎంపిడిఓను ఏసిబి అధికారులు పట్టుకున్నారు.దీనిని బట్టి చూస్తే అధికారపార్టీ వారు జాతీయ ఉపాధి హామి పథకాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవచ్చు. అవినీతి పెరిగిపోయింది ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ఈ శాఖలో పనిచేసిన పనిచేసిన సిబ్బంది అధికారపార్టీ ఆగడాలకు బలైపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. - ఆర్ పిచ్చయ్య, ఎండూరివారిపాలెం రూ.కోట్లల్లో అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో కోట్లాదిరూపాయల అవినీతి చోటు చేసుకుంది. 2016–2017 సంవత్సరంలోనే 18 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందంటే అధికారపార్టీ చేసిన అక్రమాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. వలస కూలీలకు పనులు కల్పించాల్సిన నిధులను ఈవిధంగా దుర్వినియోగం చేయడం చూస్తే అధికారపార్టీ ఎవరి కోసం పనిచేసిందో అర్థంచేసుకోవచ్చు. - పి చంద్రమౌళిరెడ్డి , వైఎస్సార్ సీపీ కన్వీనర్, త్రిపురాంతకం -
దేన్నీ వదల్లేదు.. మొత్తం మింగేశారు
సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఐదేళ్లలో అందినకాడికి అవినీతి సొమ్మును వెనకేసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పాలకుల జేబులు నింపేందుకే అన్నట్లు వ్యవహరించారు. నీరు–చెట్టు, నీటికుంటలు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ ఇలా అన్ని పథకాలకు అవినీతి మరకలు అంటించారు. ప్రజలను అమాయకులను చేసి వారికి అందాల్సిన నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పెద్దారవీడు మండలంలోని ఒక్క మద్దలకట్ట పంచాయతీలోనే మరుగు దొడ్ల పేరుతో రూ. 27,15,500 సొమ్మును కాజేశారు. సగం సగం పనులు చేయించుకున్న లబ్ధిదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఖాతాల్లో నగదు జమ అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరగుదొడ్ల పథకం టీడీపీ అవినీతికి ఓ మచ్చు తునక. లబ్ధిదారులకు తెలియకుండానే వారికి రావాల్సిన నగదును దొడ్డిదారిన నాయకులు తమ అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. మండలంలోని మద్దలకట్ట గ్రామంలో లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 538 మందికి మరుగుదొడ్లు నమోదయ్యాయి. అధికారులు కూడా ధ్రువీకరించడంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులు గుంతలు తీయగా మరోకొంత మంది రింగులు, గోడల వరకు నిర్మాణం పూర్తి చేశారు. కానీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అవి దారిమారి నాయకుల ఖాతాల్లో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితులు ఏడాదిగా అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం విశేషం. ఎవరెవరు ఎంత దోచుకున్నారంటే..! మద్దలకట్ట పంచాయతీలో 181 మంది లబ్ధిదారుల పేరుతో - రూ. 27,15,500 అవినీతి యమా దాసయ్య 53 మందివి - రూ. 7,88,000 పత్తి శ్రీనివాసరావు 65 మందివి - రూ.9,88,500 ఔకు వెంకటేశ్వర్లు (ఎంపీటీసీ సభ్యుడు) 31మందివి - రూ. 4,70,000 ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మందివి - రూ. 1,80,000 దొడ్డా భాస్కరరెడ్డి 20 మందివి - రూ. 2,89,000 అంతా అవినీతిపరుల ఖాతాల్లోకి మద్దలకట్ట పంచాయతీలో 538 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 181 మంది లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణ నిధులు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కాజేశారు. మద్దలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దొడ్డా భాస్కరరెడ్డి 20 మంది రూ 2,89,000, చాట్లమడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యమా దాసయ్య 53 మంది రూ 7,88,000 , మాచరాజుకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పత్తి శ్రీనివాసరావు 65 మంది రూ 9,88,500, చాట్లమడ గ్రామానికి చెందిన మద్దలకట్ట ఎంపీటీసీ సభ్యులు ఔకు వెంకటేశ్వర్లు 31 మంది రూ 4,70,000, చట్టమిట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మంది రూ. 1,80,000 నిధులను వారి సొంత బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. కొంత మంది తమ బ్యాంక్ ఖాతాలలో నిధులు జమకాలేదన్న కారణంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణాలను మధ్యలోనే అపివేసినప్పటికీ అదికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేసి, నిధులను తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి బిల్లులు ఇప్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సైతం అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. బిల్లు ఇప్పించండి మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తీసి రింగులు వేశాను. బిల్లుల గురించి అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదు. మొత్తం 48 మంది గుంతలు, రింగులు, గోడలు నిర్మించాం. జనవరిలో జరిగిన జన్మభూమి గ్రాభసభలో కూడా ఫిర్యాదు చేశాం. స్థానిక టీడీపీ నాయకులు దొడ్డా భాస్కరరెడ్డి, యమా దాసయ్య, పత్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఔకు వెంటేశ్వర్లు, ఏర్వ రామాంజనేయరెడ్డి, అధికారులు కలిసి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు చేయించుకొని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నారు. మాకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ ఇవ్వలేదు. – జడ్డా దానియేలు, మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీ -
సమస్యలు రాజ్యమేలుతున్నాయి..
సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కర్షకులు... మత్స్యకారులు... దినసరి కూలీలు... లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతోమితిమీరిన అవినీతి చోటుచేసుకుంది. మరుగుదొడ్లలో అక్రమాల గుట్టు బట్టబయలవుతోంది. హౌస్‌ఫర్ ఆల్ బండారం బటయపడింది. కరువుతో రైతాంగం అల్లాడుతోంది. ఉన్న ఊళ్లో బతుకు లేక వలసవెళ్లిన మత్స్యకారులకు ఎంత కష్టం ఎంత కష్టం... పాక్‌చెరలో బందీగా మారి బిక్కుబిక్కుమంటున్న వారిని పట్టించుకునేవారెవరు? ఇవన్నీ చర్చించడానికి మళ్లీ ఓ వేదిక దొరికింది అదే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. మంగళవారం జరగనున్న ఈ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు వస్తాయో రావో... విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అన్ని వర్గాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి పరిష్కారంపై పాలకులు దృష్టిసారించడం లేదు. కనీసం మంగళవారం జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలోనైనా దీనిపై చర్చిస్తారో లేదోనని జిల్లా ప్రజా నీకం ఎదురు చూస్తోంది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది రైతులు అప్పుల ఊబితో కూరుకుపోయారు. ఖరీప్ లో వరి పంట 1,19,735 హెక్టార్లలో సాగవ్వగా 50 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. జిల్లాలో 26 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు మండలాలనే మాత్రమే కరువు జాబితాలో చేర్చింది. కరువు కారణంగా రైతాంగం ఎకరానికి రూ. 20 వేల వరకు నష్టపోయారు. కరువు మండలంగా ప్రకటిస్తే కనీసం కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని రైతులు వేడుకుంటున్నారు. సర్కారు దీనిపై పునరాలోచించాలి. మరి జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు జిల్లాలో బాలికలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. గత ఏడాది సీతానగరం వద్ద పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడి చేసి హతమార్చగా... తాజాగా ఎస్.కోట మండలం ఐతినపాలెం వద్ద తొమ్మిదేళ్ల బాలికపై మరో కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. వీటిని నియంత్రించడానికి చేపడుతున్న చర్యలేమిటో తేల్చాలి. బిక్కుబిక్కుమంటూ మత్స్యకారులు జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడినుంచి పొరపాటున పాక్‌జలాల్లోకి వెళ్లి అక్కడి కోస్టుగార్డులకు చిక్కి ప్రస్తుతం అక్కడ బందీలుగా మారారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఇక్కడ వారి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ తమవారికోసం ఎదురు చూస్తున్నారు. కనీసం వారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నమూ చేయడం లేదు. విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి మొన్నటి వరకు డెంగీ వ్యాధి కోరలు చాపింది. తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. జిల్లాలో నెల రోజుల్లో 13 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. వారిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందులో 9 నెలలు పాప కూడా ఉంది జిల్లాలో వైద్యం దైవాధీనంగా మారింది. ముఖ్యంగా జిల్లా కేంద్రాస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పూసపాటి రేగ మండలం పోరాం గ్రామానికి చెందిన జి.స్వాతి అనే గర్భిణి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేంద్రాస్పత్రి వస్తే చికిత్స అందించడంలో జాప్యం చేయడం వల్ల ఆమెకు అబార్షన్ అయింది. దీంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఘోషాస్పత్రిలో కొద్ది రోజుల క్రితం గుమ్మలక్ష్మిపురానికి చెందిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో ప్రసవించింది. ఈ రెండు ఆస్పత్రిల్లో రోగులకు సకాలంలో వైద్యం అందచరనే ఆరోపణలు ఉన్నాయి. -
మధ్యలోనే మింగేస్తున్న రాజకీయనాయకులు, అధికారులు..
ప్రకృతి విపత్తులు జిల్లాకు కొత్త కాదు.. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లింపు అంతకన్నా కొత్తకాదు! కానీ టీడీపీ ప్రభుత్వం టెక్నాలజీ పేరుతో ప్రకృతి విపత్తుల పరిహారం చెల్లింపులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించడమే ఇక్కడ కొత్త! రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ ఓ పదాన్ని తెరపైకి తీసుకొచ్చి తెరవెనుక మాత్రం బాధితుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సింది బదులు అదే పెద్ద సమస్యగా మారడమే ఇప్పుడొక విచిత్రం! దీని లక్ష్యం కేవలం ఏదొక సాకుతో పరిహారం ఎగవేయడమే! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో గత నెల 10వ తేదీన తిత్లీ తుపాను, తదనంతరం వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల వరదలతో దాదాపు 77,690 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. దీనివల్ల 2,07,786 మంది రైతులు నష్టపోయారు. వారికి సుమారు రూ.159.26 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే కొబ్బరి, జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు 28,083 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఇందుకుగాను 1,10,739 మంది రైతులకు రూ.263.55 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే 9,535 పశువులు, పౌల్ట్రీ కోళ్లు 1.50 లక్షలు చనిపోవడంతో పాటు 16 వేల పశువుల శాలలు, పౌల్ట్రీ షెడ్లు కూలిపోయాయి. ఇందుకుగాను 29,800 మంది రైతులకు పరిహారంగా రూ.34.49 కోట్లు చెల్లించాల్సి ఉంది. అన్ని రకాలు కలిపి 47,606 ఇళ్లు నష్టపోయిన బాధితులకు రూ.49.83 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఇదే తరహాలో మత్స్యశాఖకు సంబంధించి రూ. 8.36 కోట్లు, చేనేత జౌళి రంగానికి సంబంధించిన బాధితులకు రూ.9 లక్షలు, అలాగే పరిశ్రమలు దెబ్బతిన్నవారికి, ఇతరత్రా రంగాల్లో జరిగిన నష్టాలకు కలిపి మొత్తం దాదాపు 4.30 లక్షల మంది తిత్లీ బాధితులకు రూ.520 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అయితే శనివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తిత్లీ తుపాను బాధితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో అవకతవకలు, అక్రమాలు, అవినీతి, చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులంతా గళమెత్తారు. చెప్పిందొకటి... జరిగేదొకటి... తిత్లీ బాధితులకు నష్టపరిహారం మొత్తాలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు ఈనెల 5వ తేదీన పలాసలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తన చిత్రంతో డమ్మీ చెక్‌లను సైతం పంపిణీ చేశారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా 25 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ బాధిత రైతులకు మాత్రం ఇప్పటివరకూ ఊరట లభించలేదు. టెక్నాలజీతో తిత్లీ తుఫానును హ్యాండిల్ చేశామని నేతలు చెబుతున్నారు. కానీ అదే సాంకేతిక పరిజ్ఞానంతో బాధిత రైతులను బోల్తా కొట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. తుపాను వల్ల ఎలాంటి నష్టం జరిగినా పరిహారం పక్కాగా అందించాల్సింది బదులుగా ఏదో ఒక్క పంటకే పరిహారం, కొంత విస్తీర్ణంగల భూమిలో పంటకే గణన... ఇలా సవాలక్ష కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. దీంతో రైతులు పరిహారం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ఆర్‌టీజీఎస్‌తోనే మాయాజాలం... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తరచుగా వల్లిస్తున్న రియల్‌టైమ్ గవర్నన్స్ (ఆర్టీజీఎస్)తోనే పరిహారం మాయాజాలం నడుస్తోంది. వాస్తవానికి నష్టపరిహారం చెల్లింపులు గతంలో నేరుగా చెక్‌ల ద్వారా జరిగేవి. ఆ చెక్‌లను బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొనేవారు. ఈసారి మాత్రం మొత్తం వ్యవహారం అంతా ఆర్టీజీఎస్కు అప్పగించారు. అదొక ప్రైవేట్ ఏజెన్సీ మాత్రమే. తిత్లీ నష్టపరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రకారం ట్రెజరీ శాఖ ద్వారా నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ ఆ చెల్లింపుల మొత్తాన్ని ట్రెజరీ నుంచి బ్యాంకులకు చేరకుండా ఆర్టీజీఎస్కు అప్పగించారు. తర్వాత ఆర్టీజీఎస్ నుంచి బాధితుల ఖాతాల్లో మాత్రం రకరకాల కొత్త నిబంధనలు, కారణాలను చూపించి జమ చేయట్లేదు. వాస్తవానికి తుఫానుతో నష్టపోయిన పంటలకు, తోటలకు, ఇళ్లకు జియోట్యాగింగ్ చాలావరకూ జరగలేదు. నష్టాల గణన కూడా ఆదరాబాదరాగానే నిర్వహించారు. దీంతో ప్రభుత్వం విడుదల చేశామని చెబుతున్న రూ.520 కోట్ల పరిహారం సొమ్ములో కేవలం ఇప్పటివరకూ రూ.120 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు అంచనా. మిగతా సొమ్ము అంతా ఆర్టీజీఎస్ ఖాతాలోనే ఉంది. దీనివల్ల ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. తుఫాను బాధిత రైతులకు మాత్రం పరిహా రం అందలేదనే ఆవేదన మిగులుతోంది. -
'అవినీతిపరులను కొట్టిచంపితే.. పదిలక్షలిస్తా'
పట్నా: బిహార్ మాధేపూర్ ఎంపీ పప్పూ యాదవ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దర్భాంగాలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి పరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే, దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి పప్పూ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ను దోపిడి చేస్తున్న వారిని విషమిచ్చి లేదా ఉరితీసి చంపాలని అన్నారు. జెఎన్యూ వివాదం వంటి అంశాలు లాలూకు పట్టడం లేదని, ఆయన కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. అవినీతి అధికారులను పట్టపగలు కాల్చి చంపాలని డిమాండ్ చేశారు.