నాకే ఎందుకిలా జరుగుతోంది.. ఏడ్చేసిన పప్పూ యాదవ్‌ | Pappu Yadav Cries Bitterly on Stage After Filing nomination as Independent | Sakshi

నాకే ఎందుకిలా జరుగుతోంది.. ఏడ్చేసిన పప్పూ యాదవ్‌

Published Fri, Apr 5 2024 2:38 PM | Last Updated on Fri, Apr 12 2024 2:37 PM

Pappu Yadav Cries Bitterly on Stage After Filing nomination as Independent

పాట్నా: మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ బీహార్‌లోని పూర్నియా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు పదేపదే టికెట్ ఎందుకు దక్కడం లేదంటూ బోరున ఏడ్చేశారు.

వేదికపై ఏడుస్తూనే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లపై పప్పూ యాదవ్‌ విరుచుకుపడ్డారు. పూర్నియాకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ ఆర్జేడీ తమ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. తనలో ఏం లోపముందని పూర్ణియాను విడిచిపెట్టి మరో స్థానానికి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు.  

'నాలో ఏమి లోటు ఉంది? మధేపురా లేదా సుపాల్‌కి వెళ్లమని నాకు మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారు? కాంగ్రెస్‌లో నా పార్టీ విలీనానికి ముందు కూడా లాలూ యాదవ్‌ను కలిశాను. పూర్ణియాను వదిలి ఎక్కడికీ వెళ్లలేనని చెప్పాను' అని యాదవ్ కన్నీళ్లతో చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తనపై నామినేషన్‌ వేస్తున్న తన ప్రత్యర్థి భీమా భారతిపై కూడా పప్పు యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement