
పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా బిహార్ జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆయనకు సమాధానం ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ రిప్లైని పప్పు యాదవ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ లేఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు సరిపోతుంది. మేం దీనిని ఆ శాఖకు పంపిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. దీనిపై పప్పు యాదవ్ స్పందిస్తూ, అమిత్‌షా మీరు అనుకుంటే ఈ కేసులో ఒక్క నిమిషంలో సీబీఐ విచారణ మొదలవుతుంది. దయచేసి దీనిని పక్కన పెట్టొద్దు అని పేర్కొన్నారు.
చదవండి: ఎందుకీ ఆత్మహత్యలు
ఇక పప్పు యాదవ్‌తో పాటు నటుడు శేఖర్ సుమన్ కూడా సుశాంత్ ఆత్మహత్య విషయంలో పోరాటం మొదలు పెట్టాడు. అయితే ఆయన ఈ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో వెనక్కు తగ్గతున్నట్లు ఆయన ప్రకటించారు. వాళ్ల అభిప్రాయాలకు మనందరం గౌరవమివ్వాలి అని ఆయన కోరారు.
చదవండి: ‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’
ఇక సుశాంత్ చిన్నతనంలో గడిపిన పాట్నాలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న ఇంటిని మెమొరియల్‌గా మార్చనున్నట్లు అతని కుటుంబం తెలిపింది. ఇందులో ఆయన అభిమానుల కోసం సుశాంత్ దగ్గర ఉన్న బుక్స్, ఆయన వాడిన టెలిస్కోప్ ఇంకా ఇతర వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ఆయన సోషల్‌మీడియా అకౌంట్లను కూడా కొనసాగిస్తామని ఆయన కుటుంబం తెలిపింది. జూన్ 14 వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment