బిహార్‌కు చెందిన జేఏపీ నాయకుడు పప్పు యాదవ్ హస్తం గూటికి చేరారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి న్యూఢిల్లీలో అధికారికంగా పార్టీలో చేరారు. తన కుమారుడు సార్థక్ రంజన్, ఇతర పార్టీ నాయకులతో కలిసి, యాదవ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంలో ప్రకటన చేశారు.
పప్పు యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత విలీనంపై ఊహాగానాలు చెలరేగాయి. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా పప్పు యాదవ్ 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయశానని పప్పు యాదవ్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పప్పు యాదవ్ ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదన్నారు. లాలూ, కాంగ్రెస్‌తో కలిసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన జన్ అధికార్ పార్టీని ప్రారంభించడానికి ముందు, పప్పు యాదవ్ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పు యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత జన్ అధికార్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment