purnia district
-
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
పూర్ణియా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్పీ ఫోర్స్ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్‌ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్‌పై రాడ్ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
వెనక్కి తగ్గిన పప్పూ యాదవ్
బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ నేత పప్పూ యాదవ్ వెనక్కి తగ్గారు. ఇటీవలే కాంగ్రెస్‌లో తనపార్టీని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ పూర్నియా స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానం మిత్రపక్షమైన ఆర్జేడీకి దక్కింది. దీంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. "రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి, బిహార్‌లో కాంగ్రెస్ పార్టీనీ పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉన్నాను. ఐదేళ్లలో ఇక్కడి మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఒక శక్తిగా ఎదుగుతుంది" అని పప్పు యాదవ్ విలేకరులతో అన్నారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు పూర్నియా టిక్కెట్టు హామీ ఇచ్చారని పేర్కొన్న పప్పు యాదవ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అని అడిగగా ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. తన చేతుల్లో కాంగ్రెస్ జెండాను పట్టుకున్నానని, తన చివరి శ్వాస వరకు దానిని ఎప్పటికీ వదలనని, పూర్నియాలో కాంగ్రెస్‌ను బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
బిహార్ లోని పూర్ణియాలో అమిత్ షా బహిరంగ సభ
-
ఉద్యోగం లేదు.. బ్యాంకులు లోన్ ఇవ్వలేదు.. అయినా..
'Why can't there be chaiwali?': అనుకున్న కాలేజీలో సీటురాలేదనో, అకడమిక్ ఇయర్ ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదని క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థులున్న ఈ రోజుల్లో.. ‘‘అనుకున్నది జరగకపోతే జీవితం అంతటితో అయిపోయినట్లు కాదు, ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్కమ్ చెబుతుంది. ఆ దారిలో కూడా వెళ్లవచ్చు’’ అని నిరూపించి చూపిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఈ కోవకు చెందిన ప్రియాంక గుప్తా.. ‘మనస్సు ఉంటే మరో మార్గం తప్పకుండా ఉంటుంది’ అని పెద్దలు చెప్పిన మాటను చేతల్లో చేసి చూపిస్తోంది. ప్రియాంక అనుకున్న ఉద్యోగం రాలేదని, నిరుత్సాహపడకుండా, సొంతంగా టీస్టాల్ పెట్టుకుని ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఉదాహరణగా నిలుస్తోంది. బీహార్‌లోని పూర్ణియ జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్‌లో కామర్స్ డిగ్రీ చదివింది. 2019లో డిగ్రీ పూర్తయినప్పటి నుంచి బ్యాంకింగ్ ఉద్యోగంకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండేళ్లపాటు సీరియస్‌గా ప్రయత్నించినప్పటికి బ్యాంక్ ఉద్యోగి కాలేకపోయింది. దీంతో ‘ఇంకెంత కాలం ఇలా ప్రిపేర్ అవుతాం. ఉద్యోగం చేసినా, ఇంకేదైనా పనిచేసినా డబ్బులు సంపాదించడం కోసమే కదా’ అనుకుంది. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి టీసాŠట్ల్ పెట్టడానికి అనుమతి తీసుకుంది. ‘చాయ్‌వాలి’ పేరిట పాట్నా ఉమెన్స్ కాలేజీ ముందు టీస్టాల్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ పదకొండున ప్రారంభించిన చాయ్‌వాలి స్టాల్ పంచ్ కొటేషన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ‘పీనా హై పఢేగా’, సోచ్ మత్.. చాలు కర్ దే బాస్’ వంటి కోట్స్‌తో తన స్టాల్స్‌కు కస్టమర్లను రప్పించుకుంటోంది ప్రియాంక. కుల్దా టీ, మసాలా టీ, పాన్ టీ, చాక్లెట్ టీలతో పాటు కొన్ని రకాల కుక్కీలు, స్నాక్స్‌ను రూ.15 నుంచి రూ.20లకే విక్రయిస్తుండడంతో విద్యర్థులు చాయ్వాలికి ఎగబడి వస్తున్నారు. ప్రియాంక టీస్టాల్ పెట్టాలనుకున్నప్పుడు ముద్ర లోన్‌తోపాటు, ఇతర రకాల రుణాల కోసం కూడా ప్రయత్నించింది కానీ దొరకలేదు. కొన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ ఆమెకు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కొంతమంది రకరకాల డాక్యుమెంట్స్ అడిగి ఇబ్బంది పెట్టారేగానీ, రుణం మాత్రం ఇవ్వలేదు. చివరికి తన స్నేహితులు తలా కొంత సాయం చేయడంతో జమ అయిన కొద్ది మొత్తంతో టీస్టాల్కు కావాల్సిన వస్తు సామగ్రిని కొనుక్కుని స్టాల్‌ను ప్రారంభించింది. -
జైల్లో ఏటీఎం.. ఎక్కడంటే..!
పట్నా: ఏటీఎంలు వచ్చాక బ్యాంకులకు వెళ్లే పని సగం తగ్గిపోయింది. లేదంటే బ్యాంకు టైమ్ లోపల వెళ్లి ఓచర్ రాసి డబ్బులు డ్రా చేయాలంటే ఓ రోజంతా పట్టేది. డబ్బులు అత్యవసరం ఉండి.. అదే రోజు బ్యాంకుకు సెలవు ఉంటే ఇక చెప్పలేం. ఈ కష్టాలన్నింటికి ఏటీఎంతో ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. చేతిలో కార్డు ఉంటే చాలు.. నిమిషాల వ్యవధిలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఖైదీల కోసం జైల్లో కూడా ఏంటీఎం ఏర్పాటు చేయబోతున్నారు. బిహార్‌లోని పూర్నియా సెంట్రల్ జైలు అధికారులు ఖైదీల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావించారు. ఖైదీలకు తమ అవసరాల నిమిత్తం డబ్బు కావాలంటే కుటుంబ సభ్యులు వచ్చి ఇవ్వాల్సిందే. దీని వల్ల గేటు దగ్గర ఎక్కువ మంది గుమిగుడుతున్నారు. దీన్ని నివారించడం కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) ఈ సందర్భంగా పూర్నియా సెంట్రల్ జైలు సూపరిండెంట్ మాట్లాడుతూ.. ‘జైలు ప్రాగణంలో ఏటీఎం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఎస్బీఐకి లేఖ రాశాము. మరో రెండు వారాల్లో ఏటీఎం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం జైలులో 750 మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 600 వందల మందికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 400 మందికి సంబంధింత బ్యాంకుల నుంచి ఏటీఎం కార్డులు ఇప్పించాం. త్వరలోనే మిగతా వారికి కూడా అందిస్తాం అని తెలిపారు. ఇక జైలులో ఖైదీలు ప్రతి రోజు 4-8 గంటలు పని చేస్తుంటారు. ఇందుకు గాను వీరికి 52-103 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఖైదీల చేతికి ఇవ్వకుండా అకౌంట్లో జమ చేస్తారు. ఇక జైలులో లోపల కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ అవి అమల్లోకి వస్తే ఖైదీల వేతనం 112-156 రూపాయలకు పెరగనుంది. ఇక జైలులో ఖైదీలు తమ చేతిలో 500 రూపాయలు వరకు ఉంచుకోవచ్చు. (చదవండి: వామ్మో.. ఏటిఎం?) జనవరి 2019 వరకు, ఖైదీల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించేవారు. ప్రస్తుతం డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. జైలు గేటు వద్ద ఏటీఎం ఏర్పాటు చేస్తే.. ఖైదీలకు డబ్బులు ఇవ్వడానికి వచ్చే వారిని సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయడం ద్వారా ఖైదీలు జైలులో పని చేసినందుకు లభించే వేతనం నుంచి తమకు అవసరమైన నూనె, సబ్బులు, పండ్లు, స్నాక్స్ వంటి రోజువారీ వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డు ఉపయోగించి డబ్బు డ్రా చేసుకుంటారు అని అధికారులు తెలిపారు. -
ఇవే నా చివరి ఎన్నికలు : నితీష్ కుమార్
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం కీలక ప్రకటన చేశారు.బిహార్ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు నితీష్ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!) 'బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. ఇప్పటికే బిహార్‌లో రెండు దశల పోలింగ్ ముగియగా.. ఆఖరిదైన మూడో దశ నవంబర్ 7న జరగనుంది. కాగా బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. (చదవండి : నితీష్ పాలనను వ్యతిరేకిస్తున్నారు : చిరాగ్) -
అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల
పూర్ణియా: ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బిహార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అసద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ గంజ్ లో నిర్వహించిన ర్యాలీలో మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బైసీలో అనుమతి లేకుండా ఎన్నికల సభ పెట్టారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఫేస్ బుక్ లో అసదుద్దీన్ చేసిన పోస్టింగ్ లపైనా కేసు నమోదైంది. తన ఇమేజ్ ను దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథన్ కేసు పెట్టారు.