ముంబై: కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 100కు చేరనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విశాల్ పాటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేను కలిసి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపే లేటర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని అధ్యక్షడు ఖర్గే స్వాగతించారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మనవుడు విశాల్ పాటిల్. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల ఒప్పందాని కంటే ముందే శివసేన(యూబీటీ) కూటమి తరఫున తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచించాలని శివసేన(యూబీటీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది.
People of Maharashtra defeated the politics of treachery, arrogance and division.
It is a fitting tribute to our inspiring stalwarts like Chhatrapati Shivaji Maharaj, Mahatma Jyotiba Phule and Babasaheb Dr Ambedkar who fought for social justice, equality and freedom.… pic.twitter.com/lOn3uYZIFk— Mallikarjun Kharge (@kharge) June 6, 2024
దీంతో విశాల్ పాటిల్.. సాంగ్లీలో స్వతంత్రంగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు. విశాల్ పాటిల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మద్దతు తెలిపే లెటర్‌ను అందజేశారు. లోక్‌సభ సెక్రటరీ అనుమతి ఇస్తే.. విశాల్ పాటిల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ అభ్యుర్థులు సంఖ్య కూడా 99 నుంచి 100కు పెరుగుతుంది.
మరోవైపు.. బిహార్‌లో పూర్ణియా లోక్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పప్పు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో సీట్ల ఒప్పందంతో టికెట్ లభించకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment