రాజస్థాన్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది.30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చినట్టు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోతూ ఓటమి దిశగా జారుకుంటోంది. భారత ఆదివాసీ పార్టీ తొలి బోణీ కొట్టింది. రాజస్థాన్‌లో 119 సీట్లకు గాను నవంబర్ 25న ఎన్నికలు జరగ్గా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
భారత ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం ఈ క్రమంలో షియో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి 32వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న భాటీ ఈ ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. విద్యార్థి హక్కుల కోసం పోరాటిన భాటికి యూత్ మద్దతు భారీగా లభించినట్టు తెలుస్తోంది. తాను గులకరాయినని, కుండ బద్దలుకొడతానని చెప్పిన భాటీ చెప్పినట్లే చేస్తున్నట్టుంది.
జోధ్‌పూర్‌కు చెందిన భాటీ ప్రస్తుతం బీజేపీకి, కాంగ్రెస్‌కు చెమటలు పట్టిస్తున్నాడు. ఇక్కడ బీజేపీ స్వరూప్‌సింగ్‌కు సీటు ఇచ్చింది. దీంతో తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచిన భాటీ తన హవాను చాటుకుంటూ ఆధిక్యంలో ఉన్నారు. చతుర్ముఖ పోరులో బీజేపీ స్వరూప్ సింగ్, కాంగ్రెస్ అమీన్ ఖాన్ , మరొక స్వతంత్ర అభ్యర్థి ఫతే ఖాన్ ఇక్కడ పోటీచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో షీయో నుంచి కాంగ్రెస్‌కు చెందిన అమీన్ ఖాన్ విజయం సాధించారు.
ఇది ఇలా ఉంటే ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే ఏంటి అన్న అంచనాల మధ్య పార్టీని వీడి రెబల్స్‌గా మారిన బుజ్జగించేందుకు ఇరు పార్టీలు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా అవతరించవచ్చు. రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించడంలో చిన్న పార్టీలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని భావించారు. అయితే తాజా ట్రెండ్ ప్రకారం బీజేపీ 111 స్థానాలకుపైగాఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో మేజిక్ ఫిగర్ సాధిస్తే, సింగిల్ లార్జెస్ట్‌పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మార్గం సుగమమవుతుంది.
రాజస్థాన్‌లో ఆధిక్యంలో ఉన్న సీనియర్లు
బీజేపీనేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 51,484 ఓట్ల ఆధిక్యం
కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లోత్ 14,231 ఓట్ల ఆధిక్యం
బీజేపీ ఎంపీ, తిజారా అభ్యర్థి బాబా బాలక్ నాథ్ 4807 ఓట్ల ఆధిక్యం
బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి 56,025 ఓట్ల ఆధిక్యం
బీజేపీ ఎంపీ, Jhotwara అభ్యర్థి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత 11,732 ఓట్ల ఆధిక్యం
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, లచ్మాన్‌గఢ్ అభ్యర్థి గోవింద్ సింగ్ దోతస్రా ఆధిక్యం
టోంక్ , కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ 5702 ఓట్ల ఆధిక్యం
Comments
Please login to add a commentAdd a comment