![High Court Notice To telangana Govt On Hydra Cancel petition](/styles/webp/s3/article_images/2024/09/13/Telangana_HC_Hydra.jpg.webp?itok=feWwVsjF)
సాక్షి, హైదరాబాద్: నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ‘హైడ్రా’ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి కౌంటర్ ఆదేశాలు జారీ చేసింది.
హైడ్రా ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చి జీవో 99ను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మీ అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్దంగా జరిగిందని పిటిషనర్ వాదించారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని తెలిపారు. జీహెచ్‌ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment