
బంజారాహిల్స్: అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్‌పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే యువతి(22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. డబ్బులు ఇస్తానని లోపలికి పిలిచిన బాలు నాయక్ ఆమెను గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడిపితే రూ. 5 వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తన బంధువుకు ఫోన్ చేసింది. ఇద్దరూ వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం
Comments
Please login to add a commentAdd a comment