సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతకు బిగ్ షాక్ తగిలింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ 2018లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన ఓ మహిళ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో, బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ కేసులో విచారణలో భాగంగా గురువారం ఢిల్లీ హైకోర్టు.. షానవాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, 3 నెలల్లో పోలీసులు విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని వాస్తవాలను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Delhi HC orders FIR against BJP leader Shahnawaz Hussain in rape case, chides police for ‘complete reluctance’https://t.co/kmI5D1X4TO pic.twitter.com/lRH46nmDqQ
— Shining India News (@shiningindnews) August 18, 2022
ఇది కూడా చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు
Comments
Please login to add a commentAdd a comment