
బంజారాహిల్స్: బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూతురు శృతిరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో నివసించే పొట్లూరి వరప్రసాద్ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం విషయంలో గత నెల 14వ తేదీన జరిగిన గొడవలో శృతిరెడ్డి తనపై కులం పేరుతో దూషించారని బోరబండ రా జ్‌నగర్‌కు చెందిన ఎం.ఎలిషాబాబు న్యా యస్థానా న్ని ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు బంజా రాహిల్స్ పోలీసులు ధర్మవరం కొట్టం శృతిరెడ్డి, వినోదలపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పొట్లూరి వరప్రసాద్ ఇంటి ప్రహ రీ కంచె పనులను ఎలిషా బాబు పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో శృతి రెడ్డి అక్కడికి వచ్చి కూ లీలను నెట్టేసి ప్రహరీని ధ్వంసం చేయడ మే కాకుండా.. అక్కడే ఉన్న తనను దూషించారంటూ ఎలిషాబాబు ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!)
Comments
Please login to add a commentAdd a comment