
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
కాగా, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏసీపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. హిందీ నేర్పిస్తానని థాయ్‌లాండ్ విద్యార్థిని ఇంటికి పిలిచి ప్రొఫెసర్ రవిరంజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాఫ్ట్ డ్రింక్‌లో లిక్కర్ కలిపి అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.
మరోవైపు.. విద్యార్థినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో హిందీ ప్రొఫెసర్ రవిరంజన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, దారుణ ఘటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment