సాక్షి, శ్రీకాకుళం: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పోలీసు కామాంధుడి ఆగడాలు బయటపడ్డాయి. అక్రమ మద్యం అమ్ముతోందని ఓ కిరాణా షాపు మహిళ యజమానిని పొందూరు ఎస్‌ఐ రామకృష్ణ అదుపులోకి తీసుకొన్నాడు. ఇంటికి వచ్చి లైంగిక వాంఛ తీర్చితే ఆ కేసు నుంచి తప్పిస్తానని, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలితో ఎస్ఐ చేసిన ఫోన్ సంభాషణలు బయటపడటంతో ఆ కీచక ఎస్‌ఐ గుట్టురట్టైంది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద బొడ్డేపల్లి మీనాక్షి అనే మహిళ కిరాణా దుకాణం నడుపోతున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందటంతో పొందూరు ఎస్‌ఐ ఆమె దుకాణంపై దాడి చేశారు. (మల్లెపూలలో మద్యం బాటిళ్లు)
దీంతో మీనాక్షి దుకాణంలో 11 మద్య సీసాలు దొరికాయి. మద్య సీసాలతో పాటు ఆమెను కూడా పోలీసులు స్టేషన్‌కు తరలించి ఒక రోజంతా స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అయితే ఈ కేసు విషయంలో తనను విడిచిపెట్టమని మీనాక్షి ఎంతో ప్రాధేయపడ్డారు. ఓ శుభకార్యం కోసం కొనుగోలు చేసిన సీసాలను పట్టుకొని కేసు పెట్టవద్దని వేడుకున్నారు. మీనాక్షిపై కామవాంఛ పెంచుకున్న ఎస్‌ఐ శుభకార్యం కోసం అయితే కేసు నుంచి విడిచిపెడతాను. నువ్వంటే నాకు ఇష్టం అంటూ తన ఇంటికి రావాలని ఆమెను ఆదేశించాడు. తనకు గౌరమైన కుంటుంబం, తండ్రి, పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని మీనాక్షి ఎస్ఐ రామకృష్ణని ప్రాధేయపడ్డారు. కానీ, ఎస్‌ఐ తన బుద్ధి మార్చుకోకుండా ఆమెకు పదే పదే ఫోన్‌లు చేసి వేధించాడని బాధితురాలు ఫోన్ వాయిస్ రికార్డింగ్‌లను మీడియాకు అందజేశారు.
ఒక మహిళను బెదిరించి లోబరుచుకునే ప్రయత్నం చేసిన పొందూరు ఎస్.ఐ రామకృష్ణను సస్పెండ్ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ చెప్పారు. ఎస్.ఐ పై తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము.
— Vasireddy Padma (@padma_vasireddy) August 24, 2020
ఎస్ఐను సస్పెండ్ చేశాం: ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్ఐ కొల్లి రామకృష్ణను సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. ఓ కేసులో మహిళా పట్ల ఫోన్‌లో అనుచితంగా వ్యహరించినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. ఎస్ఐ కొల్లి రామకృష్ణ పై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విటర్‌లో వెల్లడించారు. (వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి )
Comments
Please login to add a commentAdd a comment